breaking news
Mount Fuji
-
12వేల అడుగుల శిఖరం ఎక్కిన 102 ఏళ్ల వృద్ధుడు
టోక్యో: ఏదైనా సాధించాలని అనుకుంటే దానికి వయసు ఎంతమాత్రం అడ్డంకి కాదని ‘కోకిచి అకుజావా’ నిరూపించాడు. జపాన్‌కు చెందిన ఈ 102 రెండేళ్లు వృద్ధుడు హృద్రోగంతో బాధపడుతున్నాడు. అయినా దానిని లెక్కచేయకుండా అత్యంత ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించి, గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నాడు.1923లో జన్మించిన కోకిచి అకుజావా, నెలల తరబడి శిక్షణ పొందిన తర్వాత ఈ నెల ప్రారంభంలో జపాన్‌లోని అత్యంత ఎత్తయి శిఖరాగ్రానికి చేరుకున్నాడు. అకుజువా మీడియాతో మాట్లాడుతూ.. తాను ఈ శిఖరాన్ని చివరిసారి అధిరోహించినప్పటి కన్నా ఇప్పుడు ఆరేళ్లు పెద్దవాడినని అన్నారు. నాడు 96 ఏళ్ల వయసులో 3,776 మీటర్ల (12,388-అడుగులు) శిఖరాన్ని అధిరోహించానన్నారు. పశువుల పెంపకందారుడు, అకుజావా స్వచ్ఛంద సేవకునిగా, పెయింటర్‌గా పేరొందారు. గత జనవరిలో తాను హైకింగ్ చేస్తున్నప్పుడు కాలుజారి పడ్డానని, హృద్రోగాన్ని ఎదుర్కొన్నానని అయినా పర్వాతారోహ శిక్షణకు వెనుకడుగు వేయలేదన్నారు.తాను చాలా వేగంగా కోవడాన్ని వైద్యులు కూడా నమ్మలేకపోయారని అకుజావా తెలిపారు. కుటుంబంలోని వారు వద్దని చెప్పినప్పటికీ అకుజావా పర్వాతారోహణ ప్రయత్నాన్ని విరమించలేదు. ఎద్దయిన పర్వతం మౌంట్ ఫుజిని మూడు రోజులలో అధిరోహించాడు. రాత్రి వేళ విశ్రాంతి తీసుకుంటూ అధిరోహణ కొనసాగించాడు. ఈ ప్రయత్నంలో కొందరు సహచరులు అతనికి సాయం అందించారు. -
జపాన్ యుద్ధ విన్యాసాలు..
మౌంట్ ఫ్యూజీ : జపాన్ గుండెల్లో వణుకు పుట్టిన ఉత్తర కొరియాకు ప్రతిగా ఆ దేశం కూడా దూకుడు ప్రదర్శిస్తోంది. కిమ్ వరుస హెచ్చరికల నేపథ్యంలో జపాన్ కూడా యుద్ధ విన్యాసాలను ప్రారంభించింది. జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఆధ్వర్యంలో మౌంట్ ఫ్యూజీ ప్రాంతంలో ఈ లైవ్ ఫైర్ డ్రిల్స్‌ను ప్రారంభించింది. ఉత్తర కొరియా ప్రయోగించిన ప్రతి క్షిపణి జపాన్ సముద్రంలో పడుతుండటం ఇటీవల సబ్ మెరైన్ నుంచి క్షిపణి ప్రయోగాలను చేపడుతున్న సమయంలో జపాన్ ఈ విన్యాసాలను చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2,400 మంది సైనికులు పాల్గొన్న ఈ విన్యాసాలలో పలు యుద్ధ ట్యాంకులు, జపాన్ నూతనంగా అభివృద్ధి చేసిన క్షిపణులను పరీక్షించారు. అన్ని ఆయుధాల పనితీరు బాగుందని ఎటువంటి చర్యలనైనా ఎదుర్కోవడానికి సిద్దమని ఆ దేశ రక్షణాధికారులు ప్రకటించారు. కాగా ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగంతో తమకు ప్రత్యక్షంగా ఎలాంటి ముప్పు లేదని అధికారులు చెబుతున్నారు.