భూ వివాదంతో మంత్రికి సంబంధం లేదు | - | Sakshi
Sakshi News home page

భూ వివాదంతో మంత్రికి సంబంధం లేదు

Mar 21 2026 6:40 AM | Updated on Mar 21 2026 6:40 AM

ఇది దాయాదుల మధ్య సమస్య

మణికొండ: తమ ఉమ్మడి కుటుంబ భూ తగాదాతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి, ఆయన కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డికి, వారి సంస్థకు ఎలాంటి సంబంధం లేదని.. తమకు రావాల్సిన పొలాన్ని కలుపుకుని తమ చిన్నాన్న కుటుంబీకులు ప్రహరీ నిర్మాణం చేసుకుంటూ వివాదం పెద్దది చేస్తున్నారని గండిపేట మండలం వట్టినాగుపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్‌ 259 యజమానులు అవినవ్‌షా, అక్షయ్‌షాలు పేర్కొన్నారు. తమ పొలంలో తిరిగి ప్రహరీ నిర్మిస్తున్నారన్నారని వివరించారు. శుక్రవారం వారు పొలం వద్దే మీడియాతో మాట్లాడారు. వట్టినాగులపల్లి సర్వేనెంబర్‌ 245, 259,260లలో షా కుటుంబంలోని నలుగురు అన్నదమ్ములకు 300 ఎకరాల భూమి ఉండేదని, అందులో కొంత భూమి విక్రయించారని.. 40 ఎకరాలు ఓఆర్‌ఆర్‌, కోకాపేట ట్రంపెట్‌ నిర్మాణానికి తీసుకున్నారన్నారు. మిగిలిన 160 ఎకరాల భూమిని అందరం కలిసి 2006లో దక్షిణ్‌ షెల్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు డెవలప్‌మెంట్‌కు ఇచ్చామన్నారు. వారు జీవో 111 కారణంతో ఎలాంటి నిర్మాణం చేపట్టకపోవటంతో 2025లో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామన్నారు. ప్రస్తుతం సర్వేనెంబర్‌ 260లో ఉన్న 10 ఎకరాలతో పాటు 259లో ఉన్న 3.20 ఎకరాలను న్యూజెమ్‌ సంస్థకు డెవలప్‌మెంట్‌కు ఇచ్చామన్నారు. 259 సర్వే నెంబర్‌లోని 3.20 ఎకరాల భూమి విషయంలోనే వివాదం ఉందని, అందులో తమకు భూమి ఉందని తాము, లేదని తమ చిన్నాన్న సతీష్‌షాల మధ్య వివాదం నడుస్తోందన్నారు. తమ భూమిని 2025లో ఏడీ సర్వే నిర్వహించి వారు చూపించిన హద్దులను తమ చిన్నాన్న సతీష్‌షా అంగీకరించటం లేద న్నారు. ఈ వివాదంలోకి మంత్రిని ఎందుకు లాగుతున్నారనే విషయం తమకు తెలియద న్నారు. ఇదిలా ఉండగా మొత్తం భూమి తమ పేర్లపై 40 సంవత్సరాల క్రితమే రిజిస్ట్రేషన్‌ అయిందని, అయినా తమకు భూమి ఉందని తమ దాయాదులు వస్తున్నారని మరో భూ యజమాని పల్లవిషా అన్నారు.

రెవెన్యూ అధికారులే పరిష్కరించాలి

వట్టినాగులపల్లి భూ యజమానులు అవినవ్‌ షా, అక్షయషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement