ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలి

Mar 21 2026 6:40 AM | Updated on Mar 21 2026 6:40 AM

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

సాక్షి, సిటీబ్యూరో: ‘ఎంతో కష్టపడి చదువుకుని గ్రూప్‌–1 ఉద్యోగాలకు ఎంపికయ్యారు. పలు శాఖల్లో అధికారులుగా మీరు విధులు నిర్వహించనున్నారు. మీరే మీ విభాగాల్లో ప్రత్యేకతను చాటాలి. అధికారులపై ప్రజలకు నమ్మకం కలిగేలా మీ చర్యలుండాలి. ప్రజాప్రయోజనమే లక్ష్యంగా పనిచేయాలి. మీ విభాగాల్లో ఎవరికి వారు కొత్త చరిత్రను సృష్టించాలి’ అని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ అన్నారు. గ్రూప్‌–1 కేడర్‌కు ఎంపికై న ఉద్యోగుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం డా.మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో హైడ్రా కమిషనర్‌ మాట్లాడారు. సమాజ ప్రయోజనాలు కోరి మంచి చట్టాలు రూపొందించుకున్నాం. అవి పేపరు మీద అన్నీ ఉంటాయి. కానీ, వాటిని అమలు చేయకపోతే ప్రయోజనం లేదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement