16 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా | - | Sakshi
Sakshi News home page

16 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

Mar 21 2026 6:40 AM | Updated on Mar 21 2026 6:40 AM

16 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

రూ.3,200 కోట్ల విలువైన భూమి చుట్టూ ఫెన్సింగ్‌

గచ్చిబౌలి: శేరిలింగంపల్లి టీఎన్‌జీఓకాలనీలో 16 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. హెచ్‌ఎండీఏ లే అవుట్‌లో 10 ఎకరాల ముసాయికుంట, నాలుగు ఎకరాలు గ్రీన్‌ బెల్ట్‌ ఏరియా, ప్రభుత్వ పాఠశాలకు కేటాయించిన రెండు ఎకరాలు.. ఇలా మొత్తం 16 ఎకరాలు కబ్జా అవుతోందని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన హైడ్రా.. భూమి విలువ రూ.3,200 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం భూమిని కాపాడి ఫెన్సింగ్‌ వేశారు. అనంతరం ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement