మణికొండ వేదకుమార్‌కు అరుదైన గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

మణికొండ వేదకుమార్‌కు అరుదైన గుర్తింపు

Mar 20 2026 9:16 AM | Updated on Mar 20 2026 9:16 AM

ఇంటాక్‌ న్యూఢిల్లీ గవర్నింగ్‌ కౌన్సిల్‌కు నాలుగోసారి ఎన్నిక

హిమాయత్‌నగర్‌: డెక్కన్‌ హెరిటేజ్‌ అకాడమీ ట్రస్ట్‌ చైర్మన్‌ మణికొండ వేదకుమార్‌ ఇండియన్‌ నేషనల్‌ ట్రస్ట్‌ ఫర్‌ ఆర్ట్‌, కల్చరల్‌ హెరిటేజ్‌ (ఇంటాక్‌), న్యూఢిల్లీ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో నాలుగోసారి ఎన్నికై నట్లు డెక్కన్‌ హెరిటేజ్‌ అకాడమీ ట్రస్ట్‌ సెక్రెటరి కట్టా ప్రభాకర్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వేదకుమార్‌ అర్బన్‌, రీజనల్‌ ప్లానర్‌, అంకితభావంతో పనిచేస్తున్నారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో ఇంటాక్‌ చరిత్రలోనే అత్యధిక ఓట్లు సాధించడం ఆయన నిబద్ధత, విశ్వసనీయత, వారసత్వ సంరక్షణలో చేసిన విశిష్ట సేవలను ప్రతిబింబిస్తోందని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement