సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో వ్యాపారాలు అధిక విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితులు రాకుండా అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌కు చెందిన టెక్నాలజీ సంస్థ భారత్ స్మార్ట్ సర్వీసెస్ “ఉగాది 2026 జీరో ఎక్సెస్ బిల్ తెలంగాణ ఉద్యమం”ను చెర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో ప్రారంభించింది.ముఖ్యంగా పవర్ ఫ్యాక్టర్ (PF), డిమాండ్ ప్రవర్తన, లీడ్–లాగ్ పరిస్థితులు వంటి అంశాలు అధిక విద్యుత్ బిల్లులకు ఎలా కారణమవుతాయో అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కోరల్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (భారత్ స్మార్ట్ సర్వీసెస్) సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సికిందర్ రెడ్డి తండ్రా మాట్లాడుతూ, రోజుకు కేవలం ఒక నిమిషం సమయం కేటాయించి విద్యుత్ వినియోగాన్ని పరిశీలిస్తే అధిక బిల్లులను నివారించ వచ్చన్నారు. LT వినియోగదారుల కోసం lead unblocking గడువు మార్చి 31, 2026 వరకు పొడిగించామని, కాబట్టి kVAh ఆధారంగా బిల్లు చెల్లించే వినియోగదారులు వెంటనే తమ బిల్లులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంస్థ సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని సంస్థ తెలిపింది.


