హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి
హన్మకొండ చౌరస్తా : వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి.. ఎన్ఎస్యూఐ యూత్ కాంగ్రెస్ విభాగాలనుంచి ప్రజల మధ్య తిరుగుతూ కష్టపడి ఈ స్థాయికి వచ్చాడని, కేటీఆర్‌లా తండ్రి పేరు చెప్పుకొని మేనేజ్మెంట్ కోటాలో రాజకీయాల్లోకి రాలేదని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి ఎద్దేవా చేశారు. హనుమకొండలోని డీసీసీ భవన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వరంగల్ నగర అభివృద్ధిపై ఆధారాలతో చర్చకు రావాలని సవాల్ చేస్తే చేతకాక ప్రభుత్వ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌పై దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు. ఎమ్మెల్యేగా రాజేందర్‌రెడ్డి.. మరో ఎమ్మెల్యే కేటీఆర్‌కు సవాల్ చేస్తే ప్రజలు ఛీకొట్టి తిరస్కరించిన వినయ్‌భాస్కర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమావేశంలో హనుమకొండ డీసీసీ మీడియా కమిటీ చైర్మన్ మార్క విజయ్‌గౌడ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అజీజ్ ఖాన్, టీపీసీసీ నాయకుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.


