రూ.2.90 లక్షలకు పసికందు విక్రయం | - | Sakshi
Sakshi News home page

రూ.2.90 లక్షలకు పసికందు విక్రయం

Nov 26 2026 1:47 AM | Updated on Nov 26 2026 1:47 AM

రూ.2.90 లక్షలకు పసికందు విక్రయం

ఎలా జరిగింది?

కాశిబుగ్గ: మూడో సంతానమైన ఆడపిల్లను రూ.2.90 లక్షలకు అమ్మిన కేసును వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధి మట్టెవాడ పోలీసులు, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ (1098) ప్రతినిధుల సమన్వయంతో చేధించారు. పసికందును తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేర్చి, బాధ్యులైన మొత్తం 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విక్రయం తతంగంలో దళారులకు రూ.1.90 లక్షలు ముట్టగా, పసికందు నానమ్మకు రూ.లక్ష ముట్టజెప్పారు. బుధవారం పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌ కార్యాలయంలో పోలీస్‌ డిప్యూటీ కమిషనర్‌ దారా కవిత ఈ కేసు వివరాలను వెల్లడించారు.

మధ్యవర్తుల పాత్ర..

దాదాపు రెండు నెలల క్రితం మధ్యవర్తులైన పులిచేరు సాంబయ్య, గుగులోత్‌ నీలా, జంజర్ల స్వామిని ఆడపిల్ల అమ్మకంపై సంప్రదించారు. ఈ క్రమంలో స్వామి చిన్నమ్మ కడారి పుష్ప ద్వారా పిల్లలు లేని ఆలకుంట్ల ఐలమల్లు ఆమె తమ్ముడు మిరియాల రాజు దృష్టికి తెచ్చారు. రాజు తన స్నేహితుడైన దేశాయిపేట లక్ష్మీ మెగా టౌన్‌షిప్‌ నివాసి క్యాతం దేవేందర్‌కు పిల్లలు లేరని తెలుసుకున్నాడు. దీంతో పసికందును రూ.2.90 లక్షలకు విక్రయించాలని ఒప్పందం చేసుకున్నారు.

ఎంజీఎం వద్ద పసికందు అప్పగింత

ఒప్పందం ప్రకారం.. ఈనెల 21న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎంజీఎం మొదటి గేట్‌ వద్దకు పసికందును తీసుకొచ్చి మైదం సుగుణ అలియాస్‌ స్వరూప ద్వారా కారులో ఉన్న రాజు, ఐలమల్లు, పుష్పకు అప్పగించారు. గతంలో తనవద్ద తీసుకున్న రూ.లక్ష అప్పును మినహాయించి, మిగిలిన రూ.1.90 లక్షలు రాజుకు దేవేందర్‌ చెల్లించాడు. రాజు నుంచి సాంబయ్య రూ.1.90 లక్షలు తీసుకోగా, అందులో రూ.లక్ష పసికందు నానమ్మ అమ్మికి ఇచ్చాడు. నీలా, స్వామి రూ.30 వేల చొప్పున పంచుకున్నారు. మార్గమధ్యలో పుష్పకు రూ.9 వేలు రాజు ఇచ్చాడు. అమ్మి తన వాటా నుంచి సుగుణకు రూ.2 వేలు ఇచ్చింది. అనంతరం రాజు పసికందును దేవేందర్‌ వద్దకు తీసుకెళ్లి అప్పగించారు. కాగా, పసికందు ఏమైందని తల్లి అఖిలను బంధువులు అడిగినప్పుడు ఎంజీఎం వద్ద గుర్తు తెలియని మహిళ రూ.20 ఇచ్చి పాపను ఎత్తుకెళ్లిందని అబద్ధం చెప్పింది.

పోలీసుల విస్తృత

గాలింపులు..

పసికందు విక్రయం కేసు నమోదు చేసిన నేపథ్యంలో మట్టెవాడ ఎస్‌ఐ బి.శ్రీనివాస్‌ సిబ్బందితో చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ ప్రతినిధుల సమక్షంతో దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 24న రాత్రి సమ్మయ్యనగర్‌లో అమ్మి ఇంటి వద్ద అమ్మితోపాటు అఖిల, సుమన్‌, భిక్షపతి, సాంబయ్య, నీలా, స్వామి, సుగుణను అదుపులో తీసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో దేశాయిపేట లక్ష్మీ మెగా టౌన్‌షిప్‌లో దేవేందర్‌ ఇంటిపై దాడి చేసి, రాజు, ఐలమల్లు, పుష్పను అదుపులోకి తీసుకుని దేవేందర్‌ వద్ద ఉన్న పసికందును సురక్షింగా రక్షించారు. అలాగే, నిందితుల వద్ద నుంచి రూ.1.75 లక్షలతో పాటు తెలుపు రంగు మారుతీ సుజుకీ ఎర్టీగా కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కేసును 48 గంటల్లో ఛేదించిన మట్టెవాడ సీఐ ఎన్‌.కరుణాకర్‌, ఎస్‌ఐ బి.శ్రీనివాస్‌, సిబ్బందిని సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దారా కవిత అభినందించారు.

దళారులకు ముట్టింది రూ.1.90 లక్షలు

పసికందు నానమ్మకు రూ.లక్ష

కేసును ఛేదించిన పోలీసులు

12మంది నిందితుల అరెస్ట్‌

తల్లిదండ్రులకు చిన్నారి అప్పగింత

హనుమకొండ సమ్మయ్య నగర్‌కు చెందిన గుగులోత్‌ సుమన్‌–అఖిల దంపతులకు ఇదివరకే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నాలుగు నెలల క్రితం మూడో సంతానంగా మళ్లీ ఆడపిల్ల జన్మించింది. భర్త సుమన్‌ మద్యానికి బానిసై పని చేయకుండా ఉండడంతో కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. ముగ్గురు ఆడపిల్లలను పోషించడం కష్టమని భావించిన తల్లిదండ్రులతోపాటు నానమ్మ గుగులోత్‌ అమ్మి, తాత దేవసోత్‌ భిక్షపతి కలిసి నాలుగు నెలల ఆడబిడ్డను అమ్మాలనే నిర్ణయానికి వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement