– వివరాలు 8లోu
● దగ్గరుండి సాఫ్ట్‌బాల్ క్రీడలో శిక్షణ
● నా కూతురు సాఫ్ట్‌బాల్ భారత జట్టుకు ఎంపిక సంతృప్తినిచ్చింది..
● సాయివర్షిణి తండ్రి వేల్పుల అనిల్
హనుమకొండలోని కేఎల్‌ఎన్‌రెడ్డికాలనీ సమీపంలో శాంతినగర్‌కు చెందిన వేల్పుల అనిల్ సుబేదారి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజూ వాకింగ్‌కు వెళ్లే అలవాటు ఉన్న అతను వెంట తన కూతురును కూడా మైదానానికి తీసుకెళ్లేవాడు. వివిధ క్రీడల్లో సాధన చేస్తున్న పిల్లలను చూసి కూతురు సాయివర్షిణికి ఆటలపై ఆసక్తిగా కలిగింది. సాఫ్ట్‌బాల్ క్రీడలో శిక్షణ ఇప్పించగా సాయివర్షిణి తన తండ్రి నమ్మకాన్ని నిలబెట్టి నేడు భారతజట్టుకు ఎంపికై ంది. ఈ నేపథ్యంలో తన కూతురు సాధించిన విజయాలను తండ్రి అనిల్ నేడు కూతుళ్ల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’కి వివరించారు.
– వరంగల్ స్పోర్ట్స్


