పనులు నాణ్యతతో పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

పనులు నాణ్యతతో పూర్తి చేయాలి

Sep 27 2026 4:04 AM | Updated on Sep 27 2026 4:04 AM

వరంగల్‌ అర్బన్‌: నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ సాయపురెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం నగర పర్యటనలో భాగంగా జీడబ్ల్యూఎంసీ, కుడా ఆధ్వర్యంలో కొనసాగుతున్న, ప్రతిపాదిత వివిధ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హనుమకొండ పరిధి కాజీపేట కూడలిలో ప్రతిపాదించిన జంక్షన్‌ అభివృద్ది ప్రాంతం, చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద కొనసాగుతున్న పునరుద్ధరణ, అభివృద్ధి పనులతో పాటు జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్‌ పనుల పురోగతి, వరంగల్‌ బస్టాండ్‌ నిర్మాణ పనులు, స్తంభంపల్లిలో కొనసాగుతున్న ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఉర్సు గుట్ట చెరువు పరిసరాల్లో అభివృద్ధి, ఎస్‌టీపీ పనులు పరిశీలించారు.

అభివృద్ధి పనులపై సమీక్ష

క్షేత్రస్థాయి పర్యటన అనంతరం కమిషనర్‌ క్యాంపు కార్యాలయంలో కమిషనర్‌ వెంకన్నతో కలిసి ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ సాయపురెడ్డి నగరంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ రాజ్‌కుమార్‌, కుడా సీఈఓ అజిత్‌రెడ్డి, ఈఈలు రవికుమార్‌, సంజయ్‌కుమార్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ సుచరణ డీఈలు, ఏఈలు, సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

యూజీడీపై సీడీఎంఏ సమీక్ష

వరంగల్‌ నగర సమగ్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్‌ ప్రక్రియను త్వరగా చేపట్టి, కార్యాచరణను వేగవంతం చేయాలని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ, సీడీఎంఏ డాక్టర్‌ టి.కె శ్రీదేవి అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో వరంగల్‌ నగర యూజీడీ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. కమిషనర్‌ క్యాంపు కార్యాలయం నుంచి కమిసనర్‌ టి.వెంకన్న, ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ సాయపురెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

పచ్చదనం మరింత విస్తరించాలి..

పార్కులు, సెంట్రల్‌ మీడియన్లలో పచ్చదనం మరింత విస్తరించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. గ్రేటర్‌ వరంగల్‌లో హార్టికల్చర్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పార్కులు, సెంట్రల్‌ మీడియన్లు, గ్రీనరీ అభివృద్ధి పనులను శనివారం కమిషనర్‌ సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన కాజీపేట–సోమిడి సెంట్రల్‌ మీడియన్‌, ఎకై ్సజ్‌ కాలనీలోని కనకదుర్గ పార్క్‌, పబ్లిక్‌ గార్డెన్‌లో పచ్చదనం, సుందరీకరణ, మొక్కల సంరక్షణ, నిర్వహణ తీరును పరిశీలించారు. వరంగల్‌లో కోట చెరువు, బండ్‌ వద్ద చేపట్టిన ప్లాంటేషన్‌ పనులు, లేబర్‌కాలనీలోని టీఆర్టీ పార్క్‌లో నూతనంగా చేపట్టిన గ్రీనరీ సుందరీకరణ పనులను పరిశీలించారు. కమిషనర్‌తో పాటు చీఫ్‌ హార్టికల్చర్‌ ఆఫీసర్లు లక్ష్మారెడ్డి, ప్రశాంత్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఎంఎఅండ్‌ యూడీ ఇంజనీరింగ్‌

ఇన్‌ చీఫ్‌ సాయపురెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement