కన్న కలలు ఫలించాయి
తాము చదువుకోలేక ఎదుర్కొన్న కష్టాలు తమ బిడ్డ పడకూడదని ఆ తల్లిదండ్రులు అనుకున్నారు. తాము చిందించిన ప్రతీ చెమట చుక్కను కూతుళ్ల భవిష్యత్తుకు పునాదిగా మార్చారు. మరికొందరు తల్లిదండ్రులు కొడుకు లేడని బాధపడలేదు. కూతుళ్లనే కుమారులుగా భావిస్తూ ఉన్నతస్థానాలకు వెళ్లాలని ఆశపడ్డారు. వారి నమ్మకాన్ని కూతుళ్లు నిలబెట్టారు. ఉన్నతస్థానాలకు ఎదిగి తల్లిదండ్రుల పేరు నిలబెట్టారు. నేడు (ఆదివారం) కూతుళ్ల దినోత్సవం (డాటర్స్ డే) సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో తల్లిదండ్రుల కల నెరవేర్చిన కూతుళ్లు, కూతుళ్ల కోసం కష్టపడిన తల్లిదండ్రులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు.
చదువుకోలేదన్న వెలితిని.. పిల్లల చదువుతో తుడిచేసుకున్న తల్లిదండ్రులు
వారి ఆశలను వమ్ము చేయకుండా నెరవేర్చిన కూతుళ్లు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నతస్థానాలకు ఎదిగిన పలువురు
నా పేరు కందగట్ల గణేశ్ వృత్తి రీత్యా నేను హనుమకొండలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిని. భగవంతుడు మాకు ప్రసాదించిన అమూల్యమైన వరాలు మా ఇద్దరు కుమార్తెలు. విద్య వినయ శాంతి ప్రజ్ఞ శ్రీ, వాణి వికాస సాయి శ్రీ రేష్మిత. ఇద్దరూ తమ ప్రతిభ, కృషితో హైదరాబాద్‌లోని ప్రముఖ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. 2026 మార్చి 4న మా వివాహ రజతోత్సవం సందర్భంగా.. హైదరాబాద్‌లో మాకు ఫ్లాట్ బహుమతిగా అందించారు.
నేడు కూతుళ్ల దినోత్సవం


