గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు | - | Sakshi
Sakshi News home page

గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు

Sep 27 2026 4:04 AM | Updated on Sep 27 2026 4:04 AM

గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు

హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: గ్రామాల సమగ్రాభివద్ధికి అవసరమైన పనులను గుర్తించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ సర్పంచ్‌, అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవికా మిషన్‌ గ్రామీణ్‌, వికసిత్‌ గ్రామపంచాయతీ ప్రణాళికపై సర్పంచ్‌లు, గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులకు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ప్రాంగణంలో రూపొందించిన ఆత్మకూరు గ్రామ నమూనా చిత్రపటాన్ని కలెక్టర్‌ పరిశీలించారు.

గౌరవెల్లి ప్రాజెక్టు భూ సేకరణపై సమీక్ష

గౌరవెల్లి ప్రాజెక్టు భూ సేకరణపై కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ ప్రాజెక్టులోని మేజర్‌ 2ఎల్‌ కెనాల్‌ భూ సేకరణలో భాగంగా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలోని తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు చెందిన భూమిని ప్రాజెక్టు కోసం సేకరించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.

ఖనిజాల సర్వే నివేదికలను నవీకరించాలి

జిల్లాలోని ఖనిజ సర్వే నివేదికలను నవీకరించి, తప్పులు ఉంటే సరిచేయాలని ఆర్డీఓ ఎన్‌. వెంకటేష్‌ ఆధ్వర్యంలోని ఉప కమిటీ నిర్ణయించింది. హనుమకొండ ఆర్డీఓ కార్యాలయంలో శనివారం ఉప కమిటీ సమావేశం నిర్వహించారు. భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు ఆదేశాలు, పర్యావరణ ప్రభావ అంచనా నిబంధనల ప్రకారం పర్యావరణ అనుమతుల కోసం జిల్లా సర్వే నివేదికలో గనులు, క్వారీల వివరాలను చేర్చడం తప్పనిసరని సమావేశంలో చర్చించారు. ఆయా సమావేశాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ బి.శేషాద్రి, ట్రైనీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రోహిత్‌ నేత, వివిధ శాఖల అదికారులు లక్ష్మీ ప్రసన్న,వెంకటేష్‌, డాక్టర్‌ రాధాకిషన్‌, రాజగోపాల్‌రావు, రాజేష్‌, జగత్‌సింగ్‌, స్వామి, రాములు, చైతన్య, నంద, ఎన్‌.రామాచారి, బి.రామ్‌మోహన్‌, సుభాష్‌, బి.రత్‌న్‌లాల్‌, కె.శంకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement