పరిష్కారంలో అలసత్వం వద్దు | - | Sakshi
Sakshi News home page

పరిష్కారంలో అలసత్వం వద్దు

Sep 22 2026 1:00 AM | Updated on Sep 22 2026 1:00 AM

పరిష్కారంలో అలసత్వం వద్దు

వరంగల్‌ అర్బన్‌: ప్రజలు అందించే ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహించొద్దని, సత్వరమే పరిష్కారం చూపించాలని గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ టి.వెంకన్న పేర్కొన్నారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌ సెల్‌లో కమిషనర్‌ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గతవారం ప్రజావాణిలో స్వీకరించిన వినతుల పరిష్కార స్థితిగతులను కమిషనర్‌ విభాగాల వారీగా సమీక్షించారు. బల్దియా గ్రీవెన్స్‌కు మొత్తం 94 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ జోనా, సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ రాజ్‌కుమార్‌, సిటీప్లానర్‌ రవీందర్‌ రాడేకర్‌, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్‌బాబు, హార్టికల్చర్‌ అధికారి లక్ష్మారెడ్డి, పన్నుల అధికారి రామకృష్ణ అన్ని విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

దరఖాస్తుల వివరాలు

టౌన్‌ ప్లానింగ్‌ 41

ఇంజనీరింగ్‌ 29

ఆరోగ్యం, పారిశుద్ధ్యం 10

రెవెన్యూ 08

నీటి సరఫరా 05

హార్టికల్చర్‌ 01

బల్దియా కమిషనర్‌ వెంకన్న

గ్రేటర్‌ వరంగల్‌ గ్రీవెన్స్‌కు 94 అర్జీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement