పగలు ఆటో డ్రైవింగ్‌.. రాత్రి చోరీలు | - | Sakshi
Sakshi News home page

పగలు ఆటో డ్రైవింగ్‌.. రాత్రి చోరీలు

Sep 20 2026 1:27 AM | Updated on Sep 20 2026 1:27 AM

హసన్‌పర్తి: పగలు ఆటో నడుపుతూ రాత్రివేళ చో రీలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో చోరీ వివరాలను ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ వె ల్లడించారు. నగరంలోని ఏనుమాముల బాలాజీనగర్‌కు చెందిన పస్తం ఐలుకుమార్‌ హనుమకొండ బాలసముద్రంలో ఉంటూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో డబ్బు సరిపోక పార్కింగ్‌ చేసి ఉన్న వాహనాల బ్యాటరీల దొంగతనాలకు పాల్పడ్డాడు. ఫిర్యాదు మేరకు కేయూసీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎర్రగట్టు గుట్ట వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా 16 బ్యాటరీలు చోరీ చేసినట్లు అంగీకరించాడు. వాటి విలువ సుమారు రూ. లక్ష వరకు ఉంటుందని ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ వెల్లడించారు. గతంలో సెల్‌ఫోన్లు చోరీ చేసి జైల్‌కు కూడా వెళ్లినట్లు తెలి పారు. నిందితుడి పట్టుకున్న కేయూసీ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌, ఎస్సై నవీన్‌కుమార్‌, సిబ్బంది అహ్మద్‌పాషా, రాజశేఖర్‌ను సీపీ శ్వేత అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement