కాశిబుగ్గ: వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. శుక్రవారం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి భవ న నిర్మాణ సముదాయం, మౌలిక వసతులు, విద్యుత్, పారిశుద్ధ్యం, తదితర పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణా లు పాటించకపోతే చర్యలు తీసుకోవా లని సూ చించారు. ముఖ్యంగా పనులను నిర్ధేశిత గడువులోగా పూర్తి చేసి, ఆస్పతిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆ దేశించారు. సమావేశంలో ఎంజీఎం సూపరింటెండెంట్ రాంకుమార్‌రెడ్డి, డి ప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజ నీర్ రాజకుమార్, ఎ న్పీడీసీఎల్ ఎస్‌ఈ ఆనందం, ఆర్ అండ్ బీ ఈఈ రాజేందర్, ఆర్డీఓ సుమ, ఎల్ అండ్ టీ ప్రాజెక్టు డైరెక్టర్ సర్వాణన్, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంజీఎం ఆర్‌ఎంఓ డాక్టర్ అశ్విని పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్
పోటీలకు జిల్లా జట్టు
వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు నిజామాబాద్ జిల్లా కర్నపెల్లిలో జరగనున్న రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్స్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాలొనే జిల్లా జట్టు శుక్రవారం బయల్దేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి వరంగల్ జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సాంబశివరావు హాజరై మాట్లాడారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అసోసియేషన్ బాధ్యులు రాజేందర్, సాంబమూర్తి, సుమలత, కోచ్ వినయ్ కుమార్, పీడీలు రాజు, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.
‘ఎఫ్‌ఎల్‌ఎన్’లో
దరఖాస్తుల ఆహ్వానం
కాళోజీ సెంటర్: ఎఫ్‌ఎల్‌ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) సెల్‌లో ఖాళీగా ఉన్న ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం ఒకటి, ఎస్‌జీటీ మూడు పోస్టులకు అర్హత, ఆసక్తి కలిగిన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ డీఈఓ బి.రంగయ్య నాయుడు తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 22వ తేదీ సాయంత్రం 4 గంటల్లోపు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. ప్రతి పోస్టుకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఈఓ తదితరులతో కూడిన కమిటీ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారని వివరించారు. ఎల్‌ఎఫ్‌ఎల్ పోస్టుకు కనీసం రెండేళ్ల హెడ్‌మాస్టర్ అనుభవంతో పాటు మొత్తం 10 ఏళ్ల సర్వీసు ఉండాలని, క్లస్టర్, మండల, జిల్లా లేదా రాష్ట్రస్థాయిలో రిసోర్స్ పర్సన్/ట్రైనర్‌గా పనిచేసిన అనుభవం, నాయకత్వం, శిక్షణ నిర్వహణ సామర్థ్యాలు, ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలని పేర్కొన్నారు. ఎస్‌జీటీ పోస్టులకు తెలుగు, ఇంగ్లిష్, గణిత విభాగాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేస్తారని, కనీసం ఐదేళ్ల బోధనా అనుభవం, రిసోర్స్ పర్సన్/ట్రైనర్‌గా అనుభవం, ఎఫ్‌ఎల్‌ఎన్ బోధనా విధానంపై అవగాహన, ఎంఎస్ ఆఫీసర్ ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలని, అభ్యర్థుల వయస్సు 56 సంవత్సరాలకు మించకూడదని తెలిపారు. ప్యానల్ ఇన్‌న్‌స్పెక్షన్ టీంలలో సభ్యులుగా ఉన్న ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలు, ఎస్‌జీటీలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులని స్పష్టం చేశారు.
● వరంగల్ కలెక్టర్ సత్యశారద
● సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
పనుల పరిశీలన


