22న వరంగల్‌ జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

22న వరంగల్‌ జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు

Sep 19 2026 8:50 AM | Updated on Sep 19 2026 8:50 AM

వరంగల్‌ స్పోర్ట్స్‌: హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఈనెల 22న వరంగల్‌ జిల్లాస్థాయి అండర్‌–14, 16, 18, 20 మెన్‌ అండ్‌ ఉమెన్‌ అథ్లెటిక్స్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్‌ అసో సియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కిషన్‌, యు గంధర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు 26, 27 తేదీల్లో జేఎన్‌ఎస్‌లో జరగనున్న తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో, సబ్‌ జూనియర్‌ విభాగం 8, 10, 12 సంవత్సరాల బాలబాలికలు మంచిర్యాలలో జరిగే సబ్‌ జూనియర్‌ రాష్ట్రస్థాయి ఎంపికల్లో పాల్గొంటా రని పేర్కొన్నారు. ఎంపికలకు హాజరయ్యే అథ్లెట్లు 22న ఉదయం 9 గంటలకు జనన ధ్రువీకరణ పత్రం లేదా పదో తరగతి మెమో, ఎంట్రీ ఫీజు రూ.100తో జేఎన్‌ఎస్‌కు హాజరు కావాలని సూచించారు. విజేతలకు సర్టిఫికెట్లు, పతకాలు అందజేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు యుగంధర్‌ రెడ్డి (9866564422), కృష్ణమూర్తి (9000354465) నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ఉద్యోగుల జిల్లా కమిటీ

కాశిబుగ్గ: వరంగల్‌ జిల్లా రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ఉద్యోగుల జిల్లా కమిటీ నూత న కార్యవర్గాన్ని శుక్రవా రం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొండపల్లి శ్రీకాంత్‌, జనరల్‌ సెక్రటరీగా నల్లబెల్లి అనిల్‌, ఉపాధ్యక్షుడిగా మోటే మహేశ్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా దాంతోజు కుమారస్వామి, ట్రెజరర్‌గా గంట రజని, సభ్యులుగా నూనె ఆనంద్‌,పాలకుర్తి అనిల్‌ తేజ, సాంబారి రాజేష్‌, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా వినీత, కోమల, బేబీ రాణి, కరుణాకర్‌, స్వాతి ఎన్నియ్యారు.

నాణ్యమైన వైద్య సేవలందించాలి

వరంగల్‌ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజారెడ్డి

కాశిబుగ్గ: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందిస్తూ, రికార్డులను ఎప్పటికప్పుడు ఆధునికీకరించాలని వరంగల్‌ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ బి.రాజారెడ్డి అన్నారు. ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో నిర్వహిస్తున్న వివిధ జాతీయ ఆరోగ్య మిషన్‌ సేవలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ప్రజలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. సేవల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement