నైపుణ్యాలు పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

Sep 18 2026 2:27 AM | Updated on Sep 18 2026 2:27 AM

హసన్‌పర్తి : విద్యార్థులు భవిష్యత్‌ అవసరాలకనుగుణగా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ఎస్సార్‌ యూనివర్సిటీ చాన్స్‌లర్‌ వరదారెడ్డి అన్నారు. ఎస్సార్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌అగ్రికల్చర్‌లో బీఎస్సీ, ఎంఎస్సీ మొదటి సంవత్సరంల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు గురువారం ఓరియంటేషన్‌ నిర్వహించారు. ఈకార్యక్రమానికి వరదారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పిల్లల భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్రకీలకమన్నారు. విద్యార్థులు అంకితభావంతో చదివి భవిష్యత్‌ను నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్సార్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ దీపక్‌ గార్గ్‌ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాధాన్యత వివరించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. స్కూల్‌ఆఫ్‌ అగ్రికల్చర్‌ డీన్‌ డాక్టర్‌ భూపాల్‌రాజ్‌, డీన్‌ అర్చనారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఎస్సార్‌ యూనివర్సిటీ

చాన్స్‌లర్‌ వరదారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement