భూముల రీసర్వే వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

భూముల రీసర్వే వేగవంతం చేయాలి

Sep 18 2026 2:27 AM | Updated on Sep 18 2026 2:27 AM

భూముల రీసర్వే వేగవంతం చేయాలి

హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: భూముల రీసర్వే పనులు వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. భూముల రీసర్వే పురోగతి, భూభారతి దరఖాస్తుల పరిష్కారం, 22ఏ భూముల దరఖాస్తుల పరిశీలనతోపాటు పీఎం–సేతు పథకం, ఐటీఐల్లో నైపుణ్యాభివృద్ధి బలోపేతం తదితర అంశాలపై గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో కలెక్టర్‌ వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భూభారతి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, నిషేధిత జాబితాలోని భూముల పరిశీలనలో ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. విద్యార్థులు, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషిచేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఐటీఐల అభివృద్ధి, నాణ్యమైన శిక్షణ, పరిశ్రమలతో అనుసంధానంపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని అన్నారు. సమీక్షల్లో అదనపు కలెక్టర్‌ రవి, ఆర్డీఓలు వెంకటేశ్‌, వెంకన్నతోపాటు ప్రాంతీయ ఉపసంచాలకులు రాజా, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ నవీన్‌కుమార్‌, ఐటీఐల ప్రిన్సిపాల్స్‌ ఎం.చందర్‌, ఇ.సురేందర్‌, పి.వేణు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement