గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న
వరంగల్ అర్బన్: ప్రజల భాగస్వామ్యంతోనే వరంగల్‌ను పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దవచ్చని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న పేర్కొన్నారు. స్వచ్ఛతా హీ సేవా–2026లో భాగంగా అలంకార్ జంక్షన్ వద్ద ఉన్న కాల్వలో పేరుకుపోయిన వ్యర్థాల తొలగింపును గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మన నగరం–మన బాధ్యత, మన పరిసరాలు–మన బాధ్యత అనే స్ఫూర్తితో ప్రజలు స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొని వరంగల్‌ను పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కమిషనర్ కోరారు. శుక్రవారం నుంచి అక్టోబర్ 17 వరకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అక్టోబర్ 2న ప్రత్యేక పారిశుద్ధ్య పనులతోపాటు ‘ఏక్ పేడ్ మాకే నామ్’లో భాగంగా మొక్కల పెంపకం చేపట్టనున్నట్లు కమిషనర్ వివరించారు. సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్ పాల్గొన్నారు.


