ఉచిత పేమెంట్లను కొనసాగించాలి... | - | Sakshi
Sakshi News home page

ఉచిత పేమెంట్లను కొనసాగించాలి...

Sep 17 2026 2:20 AM | Updated on Sep 17 2026 2:20 AM

ఉచిత యూపీఐ పేమెంట్లను కొనసాగించాలి. చిరు వ్యాపారులనుంచి మొదలుకుని అన్ని రకాల జీవిత బీమా పాలసీల ప్రీమియం చెల్లింపులు ఎక్కువగా యూపీఐ పేమెంట్స్‌లోనే జరుగుతున్నాయి. నేడు యూపీఐ చెల్లింపులకు పన్ను కట్టాలన్న విధానంపై మరోమారు ఆలోచన చేయాలి.

– మేకల కేదారి యాదవ్‌,

జీవిత బీమా ఏజెంట్‌, సోమిడి

మా మార్జిన్‌పై ప్రభావం పడుతుంది

యూపీఐ ద్వారా చెల్లింపులు పెరిగాయి. కస్టమర్‌కు, మాకు సౌకర్యంవంతంగా మారింది. ఇప్పుడు వ్యాపారిపై ఎండీఆర్‌ వస్తే మా మార్జిన్‌పై ప్రభావం ఉంటుంది. కస్టమర్‌పై అదనపు చార్జీ వేయకూడదని నిబంధన ఉంటే ఆ వ్యయాన్ని మేమే భరించాల్సి ఉంటుంది. ఇది మాకు నష్టమే.

టి.సంజీవ్‌, కిరాణా వ్యాపారి, నయీంనగర్‌

అలవాటు చేసి ముంచే ప్రయత్నం...

యూపీఐ పేమెంట్స్‌ ఉచితం అంటూ లేనిపోని అలవాట్లను చేసి ఆరేళ్ల తర్వాత నట్టేట ముంచే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం చేయడం అత్యంత బాధాకరం. ట్రావెల్స్‌ రంగంలో అన్ని పేమెంట్స్‌ ఆన్‌లైన్‌లోనే చేయడం అలవాటుగా మారింది. డబ్బులు చెల్లిస్తే పన్నులు కట్టాలి అనే విధానం ఇబ్బందికరంగానే మారుతుంది. –కాటపురం రాజు, ట్రావెల్‌ ఏజెంట్‌, కాజీపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement