ీసీనియర్‌ అసిస్టెంట్‌ ఆసిఫ్‌ సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

ీసీనియర్‌ అసిస్టెంట్‌ ఆసిఫ్‌ సస్పెన్షన్‌

Sep 17 2026 2:20 AM | Updated on Sep 17 2026 2:20 AM

బాలల సంరక్షణపై ప్రత్యేక దృష్టి

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌ కార్యాలయం సీనియర్‌ అసిస్టెంట్‌ మహ్మద్‌ ఆసిఫ్‌ను ఇటీవల సస్పెండ్‌ చేసినట్లు రిజిస్ట్రార్‌ వి. రామచంద్రం బుధవారం తెలిపారు. యూనివర్సిటీలోని ఓ విభాగానికి చెందిన విద్యార్థిని పట్ల అనుచితంగా, అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణల ఫిర్యాదుతో కేయూలోని యాంటీ సెక్సువల్‌ హారాస్‌మెంట్‌ కమిటీతో విచారణ జరిపించామని తెలిపారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా మహ్మద్‌ ఆసిఫ్‌ను సస్పెండ్‌ చేసినట్లు రిజిస్ట్రార్‌ రామచంద్రం తెలిపారు.

న్యాయ సేవాధికార సంస్థ

కార్యదర్శి పూజ

కాశిబుగ్గ: బాలల సంరక్షణ, వారి హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వరంగల్‌ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కందుకూరి పూజ తెలిపారు. ఆటోనగర్‌లోని బాలుర పరిశీలక గృహం, దేశాయిపేటలోని ఇండియా డీసీపీల్స్‌ మిషన్‌ చైల్డ్‌కేర్‌ ఇన్‌స్టిట్యూట్‌, సఖీ వన్‌స్టాఫ్‌ సెంటర్లను బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె బాలలతో ఆత్మీయంగా మాట్లాడారు. విద్య, ఆరోగ్యం, వసతి, భోజనం, భద్రత, ఇతర అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్యలను తెలుసుకుని, అవసరమైన న్యాయ సాయం అందిస్తామమని హామీ ఇచ్చారు. సఖీ వన్‌స్టాఫ్‌ సెంటర్‌లో అందుతున్న సేవలు, బాధిత మహిళలకు కల్పిసున్న న్యాయ సాయం, పోలీసు సహకారం, సంబంధిత రికార్డులు, రిజిస్టర్లను తనిఖీ చేశారు. కార్యక్రమంలో బాలల పరిశీలక గృహం సూపరింటెండెంట్‌ శ్రీదేవి, సఖి సెంటర్‌ అడ్మినిస్ట్రేటర్‌ వల్లె శ్రీలత పాల్గొన్నారు.

గైడ్‌కు అన్ని అంశాలపై అవగాహన ఉండాలి

● టూరిజం ప్రమోషన్‌ ఆఫీసర్‌ సూర్యకిరణ్‌

హన్మకొండ అర్బన్‌ : టూరిస్ట్‌ గైడ్‌ అన్ని అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని టూరిజం ప్రమోషన్‌ ఆఫీసర్‌ కుసుమ సూర్యకిరణ్‌ అన్నారు. ప్రభుత్వ మహిళా పింగిళి కళాశాలలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టూరిస్ట్‌ గైడ్‌ సర్టిఫికెట్‌ కోర్సులో భాగంగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా, ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడారు. ‘తెలంగాణ పర్యాటక సౌకర్యాలు, అభివృద్ధి–తెలంగాణ పర్యాటక ఉత్పత్తులు’ అంశంపై అవగాహన కల్పించారు. పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యత, సాంస్కృతిక ప్రదేశాలు, సందర్శకులకు మార్గదర్శకం అందించడంలో గైడ్‌ పాత్రను వివరించారు. రెండు రోజుల పర్యటనకు ముందుగానే ప్రణాళిక రూపొందించుకుని వాహనం, సమ యం, అవసరమైన వస్తువులు, సందర్శించాల్సిన ప్రాంతాలను నిర్ణయించుకోవాలన్నారు. కార్యక్రమానికి వైస్‌ ప్రిన్సిపాల్‌ జి. సుహాసిని అధ్యక్షత వహించారు. సర్టిఫికెట్‌ కోర్సు కన్వీనర్‌, చరిత్ర విభాగాధిపతి కొలిపాక శ్రీనివాస్‌, అధ్యాపకులు పి. నరేశ్‌, బి. జ్యోతి, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement