వరంగల్ కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలో నిర్వహించనున్న వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా పూర్తి చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులు, గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమీక్షించారు. సమావేశంలో ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, అదనపు కలెక్టర్లు కిశోర్‌కుమార్, వైవీ.గణేశ్, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ వసంత, వరంగల్ ఆర్డీఓ సుమ, హౌసింగ్ డీఈ గణేశ్ పాల్గొన్నారు.
అవగాహన కల్పించాలి..
గర్భిణులు, బాలింతలు, చిన్నారుల పోషణ, ఆరోగ్యం, సంరక్షణపై గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అంగన్‌వాడీ సూపర్‌వైజర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు నాణ్యమైన సేవలందేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అక్టోబర్ 8 వరకు నిర్వహించే పోషణ మాసం–26 పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. డీడబ్ల్యూఓ రాజమణి పాల్గొన్నారు.


