వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: పర్యావరణానికి హాని కలిగించని మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్టించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన వాల్ పోస్టర్‌ను కలెక్టర్ కలెక్టరేట్‌లో గురువారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రసాయనాలు, హానికరమైన రంగులతో తయారు చేసిన విగ్రహాలతో నీరు కలుషితం అవుతుందని తెలిపారు. మట్టి విగ్రహాలను వినియోగిస్తే పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు సహజ వనరులను కాపాడుకోవచ్చని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయలక్ష్మి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సునీత, డీడబ్ల్యూఓ రాజమణి, అధికారులు పాల్గొన్నారు.
ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల పోస్టర్ ఆవిష్కరణ
ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల పోస్టర్‌ను కలెక్టరేట్‌లో గురువారం వరంగల్ కలెక్టర్ ఆవిష్కరించారు. అడ్మిషన్లకు ఈనెల 15 వరకు గడువు ఉందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
హియరింగ్ ప్రక్రియ పరిశీలన
వరంగల్ చౌరస్తా: ఎస్‌ఐఆర్‌లో భాగంగా వరంగల్ ఏనుమాముల పరిధిలోని బాలాజీనగర్‌లో నిర్వహించిన హియరింగ్ ప్రక్రియను కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అభ్యంతరాలు, దావాలను నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హుల వివరాలను సక్రమంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు.


