కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ ఛీప్ మెడికల్ డైరెక్టర్ (పీసీఎండీ) నిర్మల రాజారాం అన్నారు. గురువారం కాజీపేట రైల్వే ఆస్పత్రిని తనిఖీ చేశారు. అనంతరం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన హెమటాలజీ సెల్ కౌంటర్‌ను ప్రారంభించి మాట్లాడారు. ఆస్పత్రిలో రైల్వే కార్మిక కుటుంబాలకు కావాల్సిన మెరుగైన వైద్య సదుపాయాలు, రిటైర్డ్ కార్మికుల వైద్య సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అంతకు ముందు మెడికల్ రిలీఫ్‌వ్యాన్ రైలు, రైల్వే ఆస్పత్రిని తనిఖీ చేసి నిర్వహణను అభినందిస్తూ చెరో రూ. 5 వేల చొప్పున క్యాష్ అవార్డు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. తనిఖీల్లో సికింద్రాబాద్ రైల్వే సీఎంఎస్ నారాయణస్వామి, కాజీపేట రైల్వే ఆస్పత్రి వైద్యులు నిరంజన్‌రావు, నరేందర్ హిర్వాని, యాకూబ్, హరిబాబు, తదితరులు పాల్గొన్నారు. కాగా, రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్, రైల్వే మజ్దూర్ యూనియన్ సెక్రటరీ పాక వేదప్రకాశ్, చైర్మన్ ఎస్.కె.జానిమియా, తెలంగాణ రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ కాజీపేట బ్రాంచ్ సెక్రటరీ ఎం.కె.మూర్తి, ఎన్‌ఎఫ్‌ఐఆర్ రైల్వే పెన్షనర్స్ నాయకులు కృష్ణమూర్తి, సుధాకర్‌రావు ఆధ్వర్యంలో కాజీపేట నుంచి హైదరాబాద్‌లోని రెఫరెల్ ఆస్పత్రులకు నేరుగా పంపించేందుకు అనుమతి ఇవ్వాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని వేర్వేరుగా పీసీఎండీకి వినతి పత్రాలు అందించారు.
రైల్వే పీసీఎండీ నిర్మల రాజారాం


