15 రోజుల్లో అఫిలియేషన్స్‌ అందించాలి | - | Sakshi
Sakshi News home page

15 రోజుల్లో అఫిలియేషన్స్‌ అందించాలి

Jul 12 2026 12:41 AM | Updated on Jul 12 2026 12:41 AM

15 రోజుల్లో అఫిలియేషన్స్‌ అందించాలి

ఉమ్మడి జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌

అధ్యక్షుడు అజీజ్‌ఖాన్‌

వరంగల్‌ స్పోర్ట్స్‌: నేటి నుంచి 15 రోజుల్లోపల జిల్లాలోని అన్ని క్రీడా సంఘాలు అఫిలియేషన్స్‌ అందించాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అజీజ్‌ఖాన్‌ తెలిపారు. శనివారం హనుమకొండలోని జిల్లా గ్రంథాలయంలో ఒలింపిక్స్‌ సంఘం జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కైలాస్‌ యాదవ్‌ క్రీడా వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా సైక్లింగ్‌, కిక్‌బాక్సింగ్‌, నెట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌లో ఏకగ్రీవ ఎన్నికలు చెల్లవని, హైదరాబాద్‌ స్టేట్‌ సెక్రటరీ ఇచ్చిన ఆదేశాల మేరకు అతడిని తొలగిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో జిల్లా, మండల ఎన్నికలు ఎన్నికలు ఎవరు నిర్వహించినా బైలా ప్రకారం నిర్వహించుకోవాల్సి ఉంటుందన్నారు. అనంతరం జాయింట్‌ సెక్రటరీ కృష్ణారెడ్డిని ఇన్‌చార్జ్‌ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో ఒలింపిక్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి, కోశాధికారి టి.శ్యాం ప్రసాద్‌, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, సారంగపాణి, సారయ్య, అశోక్‌, అసోసియేట్‌ వైఎస్‌ ప్రెసిడెంట్లు నలబోల సతీశ్‌, శ్యామల, పవన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement