● బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్య గౌడ్
హన్మకొండ: పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి కమిటీలు పునాది అని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. శనివారం ఆరెపల్లిలోని వజ్ర గార్డెన్‌లో బీజేపీ హనుమకొండ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బూర నర్సయ్య గౌడ్ పాల్గొని మాట్లాడుతూ.. కొత్త సభ్యత్వాలు, చేరికలను విస్తృతంగా చేపట్టాలని, రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి, నాయకులు మార్తినేని ధర్మారావు, డాక్టర్ రాజేశ్వర్, ప్రేమేందర్‌రెడ్డి, డాక్టర్ కాళీప్రసాద్, రావు పద్మ, చాడ స్వాతి, సరోత్తంరెడ్డి, చాడ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి, గొట్టికొప్పుల రాంబాబు, జయంత్ లాల్, సండ్ర మధు, మేఘనాథ్ తదితరులున్నారు.


