హసన్‌పర్తి: జిల్లా సహకార సంఘం అధికారులపై వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. హసన్‌పర్తి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనంలో డీసీసీ బ్యాంక్ నూతన శాఖను సోమవారం కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, స్థానిక ఎమ్మెల్యే కేఆర్.నాగరాజుతో కలిసి ఎంపీ కావ్య ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. జిల్లా సహకార బ్యాంక్ సీఈఓ వజీర్ సుల్తాన్‌పై మండిపడ్డారు. బ్యాంక్ ప్రారంభోత్సవానికి తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే నాగరాజు ఆహ్వానిస్తేనే ఇక్కడికి వచ్చానని, కనీసం ఫ్లెక్సీలో కూడా తన ఫొటో ఎందుకు పెట్టలేదని అడిగారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీసీసీ బ్యాంక్‌వి ఏడు శాఖలు ఉండగా, ఇందులో నాలుగు శాఖలు తన పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం బ్యాంక్ అధికారుల సన్మానాన్ని ఎంపీ కావ్య సున్నితంగా తిరస్కరించి అక్కడినుంచి వెళ్లిపోయారు. కార్యక్రమంలో ‘కుడా’ చైర్మన్, హ నుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి, డీసీసీ బ్యాంక్ సీఈఓ వజీర్‌సుల్తాన్ పీఏసీఎస్ ఇన్‌చార్జ్ జగన్మోహన్‌రావు, కార్పొరేటర్ శివకుమార్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పింగిలి వెంకట్రామ్ నర్సింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
‘సహకార’ సీఈఓపై
ఎంపీ కడియం కావ్య ఆగ్రహం
డీసీసీబీ హసన్‌పర్తి శాఖ ప్రారంభం


