
అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: అంగన్‌వాడీ కేంద్రాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. కేంద్రాల్లో అందిస్తున్న సేవల రికార్డుల నిర్వహణ సరిగా నిర్వహించాలని, మూడు నెలల పూర్తి సమాచారంపై నివేదిక అందించాలన్నారు.
వరంగల్ అర్బన్: కోర్టు ఆదేశాలతో వరంగల్ 14వ డివిజన్ ప్రతాపరుద్ర కాలనీ, సాయిగణేశ్ కాలనీల్లో అక్రమ నిర్మాణాలను బల్దియా టౌన్‌ప్లానింగ్ అధికారులు మంగళవారం కూల్చివేవారు. యజమానులు అడ్డుకున్నా పట్టించుకోకుండా పోలీసుల సహకారంతో అధికారులు పని పూర్తిచేశారు. బాలాజీనగర్ సమీపంలో వంద ఫీట్ల రోడ్డును కలిపే 30 ఫీట్ల రోడ్డును కబ్జా చేసి మూడు అంతస్తుల భవనంతోపాటు మరో భవనాన్ని నిర్మించారని స్థానికులు పలుమార్లు బల్దియా గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆరు నెలల క్రితం తీర్పు ఇచ్చింది. నోటీసులు జారీ చేసిన బల్దియా టౌన్‌ప్లానింగ్ అధికారులు, సిబ్బంది రెండు భవనాలను జేసీబీలు, డీఆర్‌ఎస్ సిబ్బంది సహకారంతో కూల్చివేశారు. అంతేకాకుండా సాయిగణేశ్‌కాలనీలో రోడ్డుపైకి చొచ్చుకువచ్చిన రేకుల షెడ్డును కూడా తొలగించినట్లు బల్దియా బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఏసీపీలు ఖాళీలొద్దీన్, శ్రీనివాస్‌రెడ్డి, నవీన్, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు శ్రీకాంత్, అనిల్ కుమార్ పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు పూర్తిచేయాలి