
బ్యాటరీలు ఎత్తుకెళ్తున్నారు!
● పోలీసులకు ఫిర్యాదు చేయండి
● మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: ‘ఇదేం చెత్త బుద్ధి వాహనాల బ్యాటరీలు ఎత్తుకెళ్తున్నారు. వారిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయాలి’ అని మేయర్ గుండు సుధారాణి హెచ్చరించారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని వాహనాల మరమ్మతుల షెడ్డు, సెకెండ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను మేయర్, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ చెత్త వాహనాల బ్యాటరీలు అపహరించుకుపోయిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లాక్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. తనిఖీల్లో సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, సీహెచ్‌ఓ రమేశ్, ఇన్‌చార్జ్ ఎస్‌ఈ, సిటీప్లానర్లు మహేందర్ రవీందర్ రాడేకర్, ఈఈలు రవికుమార్, మాధవీలత, ఏసీపీ ప్రశాంత్, డీఈ శివానంద్, శానిటరీ సూపర్‌వైజర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.