వరంగల్ లీగల్ : న్యాయవాద వృత్తిలో ఉన్నవారు నైతిక విలువలు కలిగి ఉండాలని రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి.చంద్రయ్య పేర్కొన్నారు. సోమవారం వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో ‘లా అండ్ హ్యూమన్ రైట్స్’ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ చంద్రయ్య హాజరై మాట్లాడారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నారాయణ మాట్లాడుతూ న్యాయవాదులకు చట్టాలపై అవగాహన, అమలు చేసే విధానాలపై వారి అనుభవాలను తెలుపుతూ రాష్ట్ర జల వివాదాల చట్టం గురించి వివరించారు. అనంతరం ఉభయ బార్ అసోసియేషన్ల అధ్వర్యంలో జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ నారాయణలను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ, ఉభయ బార్ అసోసియేషన్ల అధ్యక్షులు జీవన్‌గౌడ్, యం.రమేష్ బాబు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.