రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ పనులు వేగంగా పూర్తి
● టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి
హన్మకొండ: విద్యుత్ సబ్‌స్టేషన్ల రియల్ టైమ్ ఫీడర్ మానిటరింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 17 సర్కిళ్ల ఎస్‌ఈలు, డీఈలు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 15లోపు హెచ్‌టీ సర్వీసులకు ఆటోమెటిక్ మీటర్ రీడింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఇకపై కొత్తగా విడుదల చేసే సర్వీసులు కూడా ఆటో మేటిక్ మీటర్ రీడింగ్ ద్వారా పర్యవేక్షణలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ డివిజన్‌లో హై–లాస్ ఫీడర్లను గుర్తించి వాటిని పరిశీలన చేసి పెట్రోలింగ్ నిర్వహించి నష్టాలకు కారణాలను విశ్లేషించి తగ్గించాలని సూచించారు. వచ్చే వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకుని పట్టణాల్లో లోడ్ పెరుగుదల అంచనాల మేరకు ఇప్పటి నుంచే సామర్థ్యం పెంపు, అప్‌గ్రేడేషన్ పనులు మొదలుపెట్టాలని ఆదేశించారు. సమావేశంలో డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ఈలు టి.సదర్ లాల్, కె.రాజు చౌహాన్, అశోక్, వెంకటరమణ, అన్నపూర్ణ, సురేందర్, సీజీఎంలు చరణ్ దాస్, కిషన్, జీఎంలు వేణు బాబు, కృష్ణమోహన్, వెంకట కృష్ణ, శ్రీనివాస్, వాసుదేవ్, నాగ ప్రసాద్, శ్రీకాంత్, సామ్య నాయక్, కళాధర్ పాల్గొన్నారు.


