కాలేజీలో ఫ్యాకల్టీని వెంటనే మార్చాలి | - | Sakshi
Sakshi News home page

కాలేజీలో ఫ్యాకల్టీని వెంటనే మార్చాలి

Dec 23 2025 8:16 AM | Updated on Dec 23 2025 8:16 AM

కాలేజ

కాలేజీలో ఫ్యాకల్టీని వెంటనే మార్చాలి

టీటీడబ్ల్యూఆర్‌సీఈ విద్యార్థినుల డిమాండ్‌

వరంగల్‌: ఐఐటీ, నీట్‌ లాంటి ఉన్నత చదువుకు గిరి జన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రా రంభించిన తెలంగాణ ట్రైబల్‌ వెల్‌ఫేర్‌ రెసిడెన్షియ ల్‌ కాలేజీ ఆఫ్‌ ఎక్సలెన్సీ(టీటీడబ్ల్యూఆర్‌సీఈ)కాలేజీల్లో వెంటనే ఫ్యాకల్టీ మార్చాలని పలువురు విద్యార్థినులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు సోమవారం వరంగల్‌ 3వ డివిజన్‌ పరిధి హనుమకొండ పెద్దమ్మగడ్డలోని టీటీడబ్ల్యూఆర్‌సీఈ కాలేజీ విద్యార్థినులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరైన ఫ్యాకల్టీ లేకపోవడంతో తాము ఉన్నత విద్యావకాశాలు కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రస్తుత ఫ్యాకల్టీ బోధన తమకు ఏమాత్రం అర్థం కావడం లేదన్నారు. తమ ఇబ్బందులను ప్రిన్సిపాల్‌, ఆర్‌సీఓల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అందుకే విసుగెత్తి తాము ఆందోళన చేపట్టామన్నారు. ఆందోళనపై సమాచారం అందుకున్న ఆర్‌సీఓ డీఎస్‌.వెంకన్న, ప్రిన్సిపాల్‌తో పాటు పలువురు అధ్యాపకులు వచ్చి విద్యార్థినులకు సర్ది చెప్పడంతో వారు కాలేజీలోకి వెళ్లారు. ఈవిషయంపై ఆర్‌సీఓ డీఎస్‌.వెంకన్నను వివరణ కోరగా గతేడాది వరకు కాంట్రాక్ట్‌ లెక్చరర్లు ఉన్నారని, ఇప్పుడు టీఎస్‌పీఎస్‌సీ నుంచి వచ్చిన అధ్యాపకులు బోధిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు అధ్యాపకులను సమన్వయం చేస్తామని తెలిపారు.

అంతర్జాతీయ అవార్డుకు ఎంపిక

కాళోజీ సెంటర్‌: అంతర్జాతీయ అవార్డుకు ప్రముఖ జ్యోతిష్య పండితుడు, వాస్తు విద్వాంసులు చేవూరి రమేశ్‌కుమార్‌ ఎంపికయ్యారు. హనుమకొండ పరిమళకాలనీకి చెందిన రమే శ్‌ 26 సంవత్సరాలుగా జ్యోతి ష్య పండితుడిగా సేవలు అందిస్తున్నారు. ఈ మేర కు ఆయన సేవలను గుర్తించిన గ్లోబల్‌, ఈగల్‌ యూనివర్సిటీ యునిఎర్త్‌ హ్యుమానిటీ పీస్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా యూనివర్సల్‌ ఎక్సలెన్సీ అవా ర్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈనెల 27న మధ్యప్రదేశ్‌లో జరగనున్న సదస్సులో ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు కేతన్‌, భూపేశ్‌, గైడ్‌ రమణారావుతో పాటు ప్రముఖుల చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నట్లు ఆయన తెలిపారు.

కాలేజీలో ఫ్యాకల్టీని  వెంటనే మార్చాలి
1
1/1

కాలేజీలో ఫ్యాకల్టీని వెంటనే మార్చాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement