హైదరాబాద్ నిఫ్ట్‌లో అడ్మిషన్‌లు
నయీంనగర్: భారత ప్రభుత్వ జౌళిశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) హైదరాబాద్‌లో 2026 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను ఆహ్వానిస్తోందని సెంటర్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ డా.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం హనుమకొండ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో అడ్మిషన్ల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిఫ్ట్‌లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టోరల్ స్థాయిల్లో కోర్సులున్నట్లు తెలిపారు. ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు నేడు (మంగళవారం) హనుమకొండ హరిత కాకతీయ హోటల్‌లో ఉదయం10 నుంచి సాయంత్రం 4గంటల వరకు జరిగే అవగాహన కార్యక్రమంలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో రామకృష్ణ, శరవణన్ పాల్గొన్నారు.


