శనివారం శ్రీ 24 శ్రీ అక్టోబర్ శ్రీ 2026 మిత్రపక్షాలకూ బెదిరింపులే! వెన్నుపోటు పార్టీగా పేరున్న టీడీపీ దెబ్బకు మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకూ తిప్పలు తప్పడం లేదు. స్థానిక ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులను తెలుగు తమ్ముళ్లు ముప్పుతిప్పలు పెడుతున్నారు. బెదిరించి మరీ తమ పెత్తనం చలాయిస్తున్నారు. దీంతో రెండు పార్టీల వారు టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్నంబజారు: కూటమిలో ఉన్నామన్న ఆనందం జనసేన, బీజేపీ నేతలకు లేకుండా పోతోంది. భాగస్వామ్య పార్టీలుగా కలిసి పనిచేయాల్సిన చోట ఆధిపత్య పోరు నడుస్తోంది. టీడీపీ నేతల వ్యవహారశైలి మిత్రపక్షాల నాయకులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. స్థానికంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఈ అంశాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. పైకి కూటమి ఐక్యత గురించి చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ల ఉపసంహరణ వ్యవహారాలు విభేదాలకు కారణమవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ, ఉపసంహరణ పర్వం ముగిసింది. అయితే, కూటమి సర్దుబాట్లలో సీటు రాని ఎంతోమంది జనసేన, బీజేపీ నేతలకు ఆయా పార్టీల నేతలు బీ–ఫారాలు ఇచ్చారు. దానికి ‘ఫ్రెండ్లీ కాంపిటీషన్’ అనే తోక తగిలించారు. వాస్తవానికి ఫ్రెండ్లీ కాంపిటీషన్ అనేదే లేకుండా ఫైర్ కాంపిటీషన్ నడుస్తోంది.
పొత్తు ధర్మానికి తూట్లు
కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా, కొన్ని ప్రాంతాల్లో టీడీపీ నేతలు తమ నిర్ణయాలనే ఇతర పార్టీలపై రుద్దుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులకు మద్దతు ఇవ్వకపోగా, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆ రెండు పార్టీల నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. వారిపై ఒత్తిడి తెస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో జనసేన, బీజేపీ నాయకులు స్థానికంగా రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. దానిలో భాగంగానే జనసేన నుంచి బీ–ఫారం తెచ్చుకుని నామినేషన్ దాఖలు చేసిన ఒక వ్యక్తి నూతన నివాసాన్ని నిర్మించుకుంటున్నారు. తూర్పు నియోజకవర్గ ప్రజాప్రతినిధి నేరుగా సదరు వ్యక్తిని పిలిపించి, నామినేషన్ ఉపసంహరించుకోకుంటే ఇంటిని కూల్చివేస్తామని బెదిరించినట్లు తెలుస్తోంది. అదే విధంగా శ్రీనగర్‌కు చెందిన ఒక జనసైనికుడిని సైతం తన వ్యాపారంపై దాడులు చేయిస్తామని బెదిరించినట్లు చెప్పుకుంటున్నారు. కూటమి నిర్ణయాలకు అనుగుణంగా పనిచేయాలా? తమ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు పట్టుబట్టాలా? అనే సందిగ్ధంలో కొందరు నాయకులు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. టీడీపీ నేతలతో సమన్వయం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న పరిణామాలు తమకు ఇబ్బందికరంగా మారుతున్నాయని జనసేన శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ఫ్రెండ్లీ కాంపిటీషన్ పేరుతో ఒత్తిళ్లా?
ఎన్నికల్లో స్నేహపూర్వక పోటీ ఉంటుందని చెబుతూనే, మరోవైపు మిత్రపక్షాలనే ప్రత్యర్థులుగా భావించే పరిస్థితి ఏర్పడిందని జనసేన, బీజేపీ నేతలు చెబుతున్నారు. కేవలం నామ్‌కే వాస్తేగా జనసేనకు సీట్లు కేటాయించారని, బీజేపీకి అసలు సీట్లు కూడా ఇవ్వలేదని టీడీపీ తీరుపై వారు విరుచుకుపడుతున్నారు. సర్దుబాట్ల పేరుతో బుజ్జగింపులు చేయడం, అంగీకరించని వారిపై ఒత్తిడి పెంచడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
న్యూస్‌రీల్
ఒత్తిడితో నామినేషన్లు వెనక్కి?
నామినేషన్ల ఉపసంహరణ వ్యవహారం కూడా రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు ప్రచారం జరుగుతుండగా, వారిలో కొందరిపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగి అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో నామినేషన్లు ఉపసంహరించుకోని అభ్యర్థులు ఎన్నికల వేళ టీడీపీకి ఏజెంట్లుగా పనిచేయాలని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కర్మ కొద్దీ మిత్రపక్షంగా ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందని వారు మండిపడుతున్నారు.
దిక్కుతోచని స్థితిలో ..
టీడీపీతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఒకవైపు.. స్థానికంగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేసుకోవాల్సిన అవసరం మరోవైపు.. ఈ రెండు అంశాల మధ్య సమతుల్యత సాధించడం జనసేన, బీజేపీ నేతలకు సవాలుగా మారుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నేతల వైఖరిపై అసంతృప్తి పెరుగుతోందని, ఇప్పటికే కూటమిలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయని, అవసరమైతే రోడ్డెక్కేందుకు కూడా జనసేన, బీజేపీ నేతలు సిద్ధంగా ఉన్నారని బహిరంగంగానే చెబుతున్నారు. కనీసం విచక్షణ లేకుండా గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో క్యాడర్లో స్తబ్దత నెలకొంది. టీడీపీ నేతలకు పనిచేయాల్సిన పరిస్థితిలో జనసేన, బీజేపీ నేతలు ఉన్నారని తెలుస్తోంది.
శనివారం శ్రీ 24 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
వెన్నుపోటు పార్టీగా పేరున్న టీడీపీ దెబ్బకు మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకూ తిప్పలు తప్పడం లేదు. స్థానిక ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులను తెలుగు తమ్ముళ్లు ముప్పుతిప్పలు పెడుతున్నారు. బెదిరించి మరీ తమ పెత్తనం చలాయిస్తున్నారు. దీంతో రెండు పార్టీల వారు టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘ఫ్రెండ్లీ కాంపిటీషన్’ అంటూనే
టీడీపీ క్యాడర్ ఒత్తిళ్లు?
భయపెట్టి మరీ నామినేషన్ల
ఉపసంహరణకు చర్యలు
టీడీపీకి పనిచేయకుంటే కేసులే
అంటూ ప్రజాప్రతినిధుల హెచ్చరిక