నగరంపాలెం: నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని పోలీస్‌స్టేషన్లు, వివిధ విభాగాల్లో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది నుంచి వ్యక్తిగత, బదిలీలు, ఉద్యోగోన్నతులు, సెలవులు, వైద్య అవసరాలు, ఇతర పరిపాలనా అంశాలకు సంబంధించి వినతులను జిల్లా ఎస్పీ స్వీకరించారు. ప్రతి వినతిని జిల్లా ఎస్పీ పరిశీలించారు. పోలీస్ శాఖ నిబంధనలకు అనుగుణంగా త్వరగా ఆయా అర్జీలు పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని జిల్లా ఎస్పీ అన్నారు.
ఎస్పీ వకుల్ జిందల్


