చిలకలూరిపేటలో మాజీ మంత్రిపై దౌర్జన్యం | - | Sakshi
Sakshi News home page

చిలకలూరిపేటలో మాజీ మంత్రిపై దౌర్జన్యం

Oct 24 2026 5:41 AM | Updated on Oct 24 2026 5:41 AM

చిలకలూరిపేటలో మాజీ మంత్రిపై దౌర్జన్యం

సాక్షి ప్రతినిధి, గుంటూరు: చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజినిని మూడు రోజులుగా హౌస్‌ అరెస్టు చేసిన పోలీసులు, ఆమెను బయటకు రానీయకుండా చేశారు. వైఎస్సార్‌ సీపీ ముఖ్య నేతలందరినీ అదుపులోకి తీసుకున్నారు. అభ్యర్థులను నామినేషన్లు వేయనీయలేదు. శుక్రవారం ఓ జెడ్పీటీసీ అభ్యర్థి బీఫాం తీసుకునేందుకు విడదల రజిని నివాసానికి రాగా, పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న విడదల రజిని, బీఫాం ఇచ్చేందుకు అతడిని అనుమతించాలని కోరుతూ బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. కాపలాగా ఉన్న మహిళా ఎస్‌ఐ లేఖప్రియాంక ఒక్కసారిగా మాజీ మంత్రి అని కూడా చూడకుండా ఆమైపె దురుసుగా ప్రవర్తిస్తూ లోపలికి నెట్టడంతో విడదల రజిని వెన్నెముకకు గాయమైంది. మాజీ మంత్రి పరిస్థితే ఇలా ఉంటే, మిగతా నేతల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిలకలూరిపేట రూరల్‌ మండలానికి చెందిన కొంతమంది వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి, తాము నామినేషన్‌ వేసేందుకు భద్రత కల్పించాలని కోరుతూ గంటలకొద్దీ పడిగాపులు కాసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. యడ్లపాడు, నాదెండ్ల మండలాల్లో సైతం పోలీసులు అక్కడికక్కడే వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను అడ్డుకున్నారు. టీడీపీ నాయకులు నామినేషన్‌ కేంద్రాల వద్ద కర్రలు, రాళ్లతో తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement