కిక్కురుమనరు | - | Sakshi
Sakshi News home page

కిక్కురుమనరు

Sep 27 2026 3:22 AM | Updated on Sep 27 2026 3:22 AM

మద్యం షాపుల రెన్యువల్‌లో గోల్‌మాల్‌ 107 మద్యం షాపులకు లాటరీ..

రూ.16.26 కోట్ల వ్యత్యాసం

అనుకూల వ్యక్తుల కోసమేనా..?

నష్టం వస్తున్నా..
మద్యం షాపుల రెన్యువల్‌లో గోల్‌మాల్‌

● రెన్యువల్‌కు రూ.27.20 లక్షల ఫీజు

● లాటరీ ద్వారా

దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు

● నాలుగు దరఖాస్తులతో

దుకాణం కై వసం

● రెన్యువల్‌తో పోలిస్తే లాటరీ

విధానంలో భారీ వ్యత్యాసం

● ఒక్కో షాపునకు రూ.15.20 లక్షలు

ఆదాయం కోల్పోతున్న ప్రభుత్వం

● అధికార పార్టీకు లబ్ధిచేకూరేలా

నిబంధనలు

● ఉమ్మడి గుంటూరు జిల్లాలో

107 దుకాణాలు రెన్యువల్‌కు దూరం

● అక్టోబర్‌ 5న లాటరీ ద్వారా

నూతన మద్యం లైసెన్స్‌ల ఎంపిక

నరసరావుపేట టౌన్‌: మద్యం షాపుల లైసెన్స్‌ రెన్యువల్‌ వ్యవహారం అక్రమాలకు తావిస్తోంది. ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే దాంట్లో మద్యం ఒకటి. అంతటి కీలకమైన చోట లైసెన్స్‌ రెన్యువల్‌, కొత్త దుకాణాల కేటాయింపులో ప్రభుత్వం అనుసరించిన విధానంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2026–27 ఎకై ్సజ్‌ సంవత్సరానికి ప్రభుత్వం తీసుకొచ్చిన విధానంలో ప్రస్తుత లైసెన్స్‌ దారులకు రెన్యువల్‌ అవకాశం కల్పిచటంతో పాటు రెన్యువల్‌కు ముందుకు రాని దుకాణాలను మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించి లాటరీ ద్వారా కేటాయించే విధానం అమలు చేస్తుంది. కాగితంపై ఇది పారదర్శక ప్రక్రియగా కనిపిస్తున్నా.. రెన్యువల్‌, లాటరీ మార్గాల్లో చెల్లించాల్సిన నగదులో భారీ మొత్తంలో వ్యత్యాసం కనిపించటం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఇప్పటికే ఉన్న లైసెన్స్‌ దారులు రెన్యువల్‌ చేసుకోవాలంటే రూ.27.20 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. మరో వైపు రెన్యువల్‌కు రాని షాపులకు నూతనంగా దరఖాస్తులు ఆహ్వానించారు. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్‌ రిఫండబుల్‌ ఫీజు చెల్లించాలి. ఒక షాపునకు కనీసం నాలుగు దరఖాస్తులు వస్తే లాటరీ నిర్వహించే ప్రక్రియ ఉంటుంది. అంటే నాలుగు దరఖాస్తులకే లాటరీ నిర్వహిస్తే ప్రభుత్వం వసూలు చేసే దరఖాస్తు ఫీజు కేవలం రూ.12 లక్షలు మాత్రమే. ఇదే షాపు రెన్యువల్‌ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మొత్తంతో పోలిస్తే గణనీయమైన వ్యత్యాసం కనపడుతుంది. ఈ వ్యత్యాసమే అసలు కిటుకు అంటూ మద్యం వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో 107 మద్యం దుకాణాల నూతన లైసెన్స్‌లకు లాటరీ పద్దతిలో ఎంపిక చేయనున్నారు. గుంటూరు జిల్లాలో 140 మద్యం దుకాణాలకు గాను 91 దుకాణాలు, పల్నాడు జిల్లాలో 142 మద్యం దుకాణాలకు గాను 118 దుకాణాలు, బాపట్ల జిల్లాలో 104 దుకాణాల్లో 70 మద్యం షాపులు రెన్యువల్‌ అయ్యాయి. మూడు జిల్లాల్లో మిగిలిన 107 దుకాణాలకు అక్టోబర్‌ 1వ తేదీ అర్థరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరించి అదే నెల 5వ తేదీన కలెక్టర్‌ సమక్షంలో లాటరీ ద్వారా మద్యం దుకాణాలను కేటాయిస్తారు. కాగా ఒక్కో దుకాణానికి నాలుగు దరఖాస్తులు అందితే లాటరీ ప్రక్రియ నిర్వహిస్తామని ప్రభుత్వం ఇప్పటికే జీఓ జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎకై ్సజ్‌ కమిషనర్‌ సిహెచ్‌ శ్రీధర్‌ స్పష్టం చేశారు.

రెన్యువల్‌ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, లాటరీ దరఖాస్తు ఫీజుల ద్వారా వచ్చే మొత్తానికి మధ్య ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని 107 మద్యం దుకాణాలకు రూ.16.26 కోట్ల వ్యత్యాసం ఉంది. ప్రతి మద్యం దుకాణంలో రూ.15.20 లక్షలు ప్రభుత్వం ఆదాయం కోల్పోతుంది. రాష్ట్రవ్యాప్తంగా 807 మద్యం దుకాణాలకు లాటరీ పద్దతిన నూతన లైసెన్స్‌ జారీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. ప్రతి షాపు విషయంలో ప్రభుత్వ ఆదాయంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. లాటరీ విధానంలో ఆదాయం కోల్పోతున్న విషయం ప్రభుత్వం ముందే గ్రహించలేక పోయిందా.. లేక అధికార పార్టీ నేతలకు మరోదారిలో లబ్ధిచేకూర్చేందుకు వ్యూహం రచించిందో అర్థకావటంలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎకై ్సజ్‌ శాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెల్లడించాల్సి ఉంది.

రెన్యువల్‌ చేసుకోని షాపునకు ఇతరులు దరఖాస్తు చేసుకునే అవకాశం అందరికీ సమానంగా ఉండాలి. అయితే కొందరు వ్యాపారులు ముందుకు రాకుండా అధికార పార్టీకి చెందిన స్థానికుల నాయకులచే ఒత్తిళ్లు, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆన్‌లైన్‌ ద్వారా షాపు దరఖాస్తు చేసుకొని పొందినా వ్యాపారం చేయలేరంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. షాపునకు నాలుగు దరఖాస్తులు మించకుండా చేసి ఎలాగైనా తక్కువ ఫీజుతో మద్యం దుకాణాలు పొందాలని అధికార పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారు.

మద్యం దుకాణాల కేటాయింపులో మతలబు దాగి ఉందా.. ప్రభుత్వ ఖజానాకు రావలసిన ఆదాయంలో కిక్కు కొట్టే కిటుకు చోటుచేసుకుందా.. రెన్యువల్‌ చేసుకుంటే రూ.27.20 లక్షలు, అదే లాటరీలో రూ.12 లక్షలకే సరిపెట్టే విధానం వెనుక అసలు కథ ఏమిటి ? ఒక్కో షాపుపై రూ.15.20 లక్షల వ్యత్యాసం కనిపిస్తుండగా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏకంగా రూ.16.26 కోట్ల తేడా కనిపిస్తుంది. ఇది యాథృచ్ఛికంగా జరిగిందా లేక విధాన పరమైన లోపమా.. లేకుంటే మనవాళ్లకు తక్కువ ఖర్చుతో దుకాణాలు దక్కేలా వేసిన వ్యూహమా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ నిబంధనల కిటుకు ఎవరి ప్రయోజనాల కోసం అంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement