శాంతియుతంగా ర్యాలీ చేయడానికి అనుమతి అడిగితే తిరస్కరించారు. మరోవైపు అంతమంది టీచర్లను ఏ అనుమతితో లోపలికి తీసుకెళ్లారో చెప్పాలి. వారికి రక్షణగా 300 మంది కర్రలు, రాడ్లతో ఉండేలా ఎందుకు అనుమతించారో కూడా పోలీసులు సమాధానం చెప్పాలి. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వందల సంఖ్యలో వస్తారని తెలిసినా రెండు వర్గాలు ఎదురెదురుగా వచ్చే పరిస్థితిని పోలీసులు ఎందుకు నివారించలేక పోయారో చెప్పాలి. ఈ రోజు జరిగిన ప్రతిఘటన మీడియా, డ్రోన్లు, వందలాది కెమెరాల్లో రికార్డు అవుతోందని, ఆ ఆధారాల నుంచి ఎవరూ తప్పించుకోలేరని గుర్తుంచుకోవాలి.
– లేళ్ల అప్పిరెడ్డి,
ఎమ్మెల్సీ


