నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఓపెన్ కేటగిరీ కింద మొత్తం 73 మద్యం షాపుల కేటాయింపునకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు చెప్పారు. గుంటూరు బ్రాడీపేటలోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో 49, పల్నాడు జిల్లా పరిధిలో 24 దుకాణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి గల వ్యాపారులు ఆన్‌్‌లైన్, ఆఫ్‌లైన్ లేదా హైబ్రిడ్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు ఉంటుందన్నారు. దరఖాస్తు ఫీజు రూ.మూడు లక్షలుగా నిర్ణయించామని, ప్రతి షాపునకు కనీసం 10 దరఖాస్తులు వస్తేనే లాటరీ నిర్వహిస్తామన్నారు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా, ఎన్ని షాపులకై నా వేసుకోవచ్చని, లాటరీలో ఎన్ని షాపులు వస్తే అన్నింటికీ లైసెన్సులు జారీ చేస్తారని స్పష్టం చేశారు.


