అందెల సవ్వడి అలరించగా..! | - | Sakshi
Sakshi News home page

అందెల సవ్వడి అలరించగా..!

Sep 27 2026 3:22 AM | Updated on Sep 27 2026 3:22 AM

గుంటూరు ఎడ్యుకేషన్‌: నాట్యకళను అభిరుచిగా మలచుకున్న విద్యార్థినులు అందులో ప్రావీణ్యులై రాణిస్తున్నారు. ఒక వైపు చదువులో రాణిస్తూనే... మరోవైపు కూచిపూడి నాట్యంపై మనసు లగ్నం చేసి సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో తమ వంతు భాగస్వామ్యం అందిస్తున్నారు. గుంటూరులో నాట్యగురువు వద్ద శిక్షణ పొందుతున్న విద్యార్థినులు నాట్యంలో అందెవేసిన చేయిగా నిలుస్తున్నారు. గుంటూరు నగరంతో పాటు రాష్ట్రంలోని వివిధ పుణ్యక్షేత్రాల్లో నాట్య ప్రదర్శనలు ఇస్తున్నారు. గుంటూరు నగరంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులు కూచిపూడి నృత్యంలో అద్భుతమైన ప్రావీణ్యం గడించారు. నర్సరీ మొదలు టెన్త్‌, ఇంటర్‌, బీటెక్‌ వరకు చదువుతున్న విద్యార్థినులు నాట్యంలో అద్భుతమైన ప్రావీణ్యం గడించారు. వీరంతా గుంటూరు శివారు గోరంట్లకు చెందిన అను డ్యాన్స్‌ అకాడమీ నాట్య కారిణుల బృందం నాట్య గురువు అను శేఖర్‌ నేతృత్వంలో ప్రతి యేటా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, అమరావతి, పెదకాకాని వంటి ప్రముఖ ఆలయాల్లో నాట్య ప్రదర్శనలతో ప్రభుత్వ అధికారులతో పాటు వివిధ రంగాల ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు. చిత్తూరుజిల్లా కాణిపాకంలో ప్రతి యేటా శ్రీవరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాల్లో క్రమం తప్పకుండా నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. కాణిపాక బ్రహ్మోత్సవాల్లో కూచిపూడి నృత్యంతో వినాయకునికి నృత్య నీరాజనం సమర్పించడం ఆనవాయితీగా మలచుకున్న నృత్య కారిణులు ఇటీవల షిర్డీలోని సాయి సంస్థాన్‌ ట్రస్ట్‌, శ్రీకాళహస్తి, పెదకాకాని ఆలయాల్లో ప్రదర్శనలు ఇచ్చారు.

పుణ్యక్షేత్రాల్లో ప్రతి యేటా నృత్య ప్రదర్శలు

విద్యార్థినులు.. సంప్రదాయ నాట్యంలో మెరికలు

చదువుతో పాటు కూచిపూడి

నాట్యకళలో ప్రావీణ్యం

సంస్కృతి, సంప్రదాయాలను

కొనసాగిస్తున్న విద్యార్థినులు

అద్భుత నాట్యంతో ఆకట్టుకున్న

గుంటూరుకు చెందిన నాట్యకారిణులు

రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో

ప్రదర్శనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement