జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ
గుంటూరు వెస్ట్: వినాయకుని విగ్రహాలను నిర్ణయించిన ప్రత్యేక ప్రదేశాల్లో మాత్రమే నిమజ్జనం చేయాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. ఈ మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలను జారీ చేసిందని, వాటిని పాటించి పర్యావరణ హితానికి తోడ్పాటును అందించాలని కోరారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ సంప్రదాయబద్ధంగా పర్యావరణ హిత రంగులు మాత్రమే విగ్రహాలకు వినియోగించాలన్నారు. అవసరమైన సౌకర్యాలతో తాత్కాలికంగా ప్రత్యేక నిమజ్జన కొలనులను ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. మండపాలు నిర్వహించే వర్గాలు సహా ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. విగ్రహాల నిమజ్జనం సందర్భంగా నీటి నాణ్యత దెబ్బతినకుండా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఎల్‌నినో పరిస్థితులు నెలకొన్న కారణంగా ప్రజలు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.


