ఇంద్రకీలాద్రికి హరిత శోభ | - | Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రికి హరిత శోభ

Jul 29 2026 1:46 AM | Updated on Jul 29 2026 1:46 AM

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ‘వరి కంకుల మధ్య మా దుర్గమ్మా.. నిను చూచిన కనులదే భాగ్యం కదమ్మా..’ అంటూ భక్తులు పులకించారు. ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శాకంబరీ ఉత్సవాలు అంగరంగ వైభ వంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. ప్రధాన ఆలయంలో మూలవిరాట్‌కు వరి కంకులనే ఆభరణాలుగా తీర్చిదిద్దారు. ముగ్ధ మనోహరమైన అమ్మవారి రూపాన్ని చూసిన భక్తులు మైమరిచారు. తెల్లవారు జాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి శాకంబరీగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని కరివేపాకు తోటగా మలిచిన తీరు అందరికీ ముగ్ధులను చేసింది. మరో వైపు ఆషాఢ మాసోత్సవం నేపథ్యంలో అమ్మవారికి సారె సమర్పించేందుకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో క్యూలైన్లు కిటకిటలాడాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement