తాడికొండ: భూ సమస్యలకు త్వరలోనే పూర్తి పరిష్కారం చూపుతామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాజధాని రైతుల భూ సమస్యలపై మంగళవారం సీఆర్డీయే కమిషనర్ విజయ రామరాజు, అడిషనల్ కమిషనర్‌లతో త్రిసభ్య కమిటీ సభ్యులైన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌లతో కలిసి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మంత్రి పెమ్మసాని విలేకరులతో మాట్లాడుతూ సీఆర్డీయే కొత్త కమిషనర్‌గా విజయరామరాజు ఇటీవలే బాధ్యతలు స్వీకరించారని, నూతన కమిషనర్‌కు రాజధాని సంబంధిత పలు అంశాలపై అవగాహన కల్పించడంలో భాగంగా సమీక్ష నిర్వహించుకున్నట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న కొన్ని గ్రామ కంఠాల సమస్యలు, కొన్ని ఎఫ్‌ఎస్‌ఐ గ్రామాల్లోని మౌలిక వసతులు, తదితరాంశాలపై అధికారులు గ్రౌండ్ లెవెల్‌కు వెళ్లి పరిశీలిస్తే స్థానిక సమస్యలు తెలుస్తాయని అన్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలని, తద్వారా స్థానిక సమస్యలు అర్థం అవుతాయని కమిషనర్‌కు సూచించారు. ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ రోడ్ల నిర్మాణాల వల్ల ఇళ్లు కోల్పోతున్న వారికి ఎన్‌ఎస్‌పీ పాలసీ ద్వారా ఎన్‌హాన్స్ చేయాలని అన్నారు.
కేంద్ర సహాయ మంత్రి
డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్


