గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Apr 21 2026 4:14 AM | Updated on Apr 21 2026 4:14 AM

మంగళవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 నిమ్మకాయల ధరలు పులిచింతల సమాచారం యడ్లపాడు: మండలంలోని సొలస గ్రామంలో కొలువై ఉన్న భూసమేత రంగనాయకస్వామి ఆలయం కనుమరుగైన ఒక సామ్రాజ్య వైభవానికి సజీవ సాక్ష్యం. కొండవీడు ప్రాకారాల నీడలో కాలగర్భంలో కలిసిపోయిన ఒక గొప్ప సంస్కృతికి, అచంచలమైన భక్తికి ఈ కోవెల నిలువుటద్దం. ఈ నెల 27 నుంచి మే 5వ తేదీ వరకు జరగనున్న కల్యాణ మహోత్సవాల నేపథ్యంలో తరాల నాటి రాజసానికి, గొప్ప ఆధ్యాత్మికతకు వారధిగా నిలుస్తున్న ఈ పుణ్యక్షేత్ర విశిష్టతపై ప్రత్యేక కథనం.. చరిత్ర పుటలను ఒకసారి వెనక్కి తిప్పితే, క్రీస్తు శకం 1616 ప్రాంతంలో కొండవీడును పాలించిన జూపల్లి రంగపతిరావు అనే రాజు రంగనాథుడికి పరమ భక్తుడు. స్వామిపై ఉన్న అపారమైన భక్తితో శ్రీరంగం నుంచి విగ్రహాలను తెప్పించి, రామేశ్వరపు శిల్పుల చేత అద్భుతంగా తీర్చిదిద్దించి తన ఆరాధ్య దైవం పేరు మీద కొండవీడు ప్రాంతంలో ‘శ్రీరంగనగరం’ అనే ఊరిని నిర్మించాడు. కాలక్రమంలో రాజ్యాల మధ్య దండయాత్రలు, కల్లోలాల వల్ల ఆ గ్రామం విలవిలలాడింది. ఆ దివ్య విగ్రహాలకు ఎలాంటి హాని కలగకూడదన్న ఉద్దేశంతో నాటి భక్తులు స్వామిని సురక్షితంగా భూమిలో నిక్షిప్తం చేశారు. ఆ స్వామి మాత్రం శతాబ్దాలపాటు చీకటి పొరల్లో..నేల తల్లి ఒడిలో మౌనముద్రలో కాలపరీక్షకు ఎదురుచూస్తూ ఉండిపోయారు. స్వామివారు మళ్లీ వెలుగులోకి రావడానికి ఒక సామాన్యుడిని ఎంచుకున్నారు. రావి కోటయ్య అనే రైతు తన పొలంలో నాగలితో దున్నుతుండగా, భూమిలో నుంచి వింత శబ్దం వినిపించింది. తవ్వి చూడగా శ్రీదేవి, భూదేవి సమేతంగా వెలుగులీనుతున్న రంగనాయకస్వామి విగ్రహాలు దర్శనమిచ్చాయి. వాటిని నాదెండ్లకు తరలించాలని ఊరి పెద్దలు భావించినా..స్వామి ఇష్టపడకపోవడంతో అదే ప్రదేశంలో ఆలయ నిర్మాణం జరిగింది. ఆ పుణ్యమూర్తి కొలువైన ఆ పవిత్ర ప్రదేశమే నేటి సొలస గ్రామం. 1885లో బాపతు వంశీయులు స్థలాన్ని ఇవ్వగా, అర్వపల్లి కోటయ్యశ్రేష్టి, రామస్వామి శ్రేష్టి సోదరులు ముందుకు వచ్చి ఆ స్థలంలో స్వామికి భక్తిశ్రద్ధలతో రాతి ఆలయాన్ని నిర్మించి, స్వామికి జీర్ణోద్ధారణ గావించి ఈ క్షేత్రానికి పునర్వైభవం తెచ్చారు. నేడు నిత్య పూజలు అందుకుంటూ భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారమై వెలుగుతున్నాడు. ఈ ఆలయంలో గర్భగుడి ద్వారం వద్ద జయవిజయులు స్వాగతం పలుకుతారు. లోనికి వెళితే శేషతల్పంపై యోగనిద్రలో ఉన్న రంగనాథుడు, పాదసేవ చేస్తున్న శ్రీదేవి, భూదేవి మూర్తులు భక్తులను పరవశింపజేస్తాయి. ఇక్కడి మరో విశేషం ఏమిటంటే.. ప్రతి ఏటా వైశాఖ పౌర్ణమి బ్రహ్మోత్సవాలకు నాలుగు రోజుల ముందు స్వామివారి అలంకారాలను పూర్తిగా తొలగిస్తారు. ఆ ఒక్కరోజు మాత్రమే భక్తులకు స్వామివారి ‘నిజరూప దర్శనం’ లభిస్తుంది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తజనం పోటెత్తుతారు. మరో విశేషం ఏమిటంటే.. ఆంజనేయస్వామి రెండు విభిన్న రూపాల్లో కొలువై ఉండటం, గణపతిదేవుడు భూమాతలా గోళాకారంలో దర్శనమివ్వడం. ఈ పవిత్ర క్షేత్రం నేడు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ, ఆలయ సేవల్లో అనువంశిక ధర్మకర్తలు, అర్చకులు తమ భక్తిని చాటుకుంటున్నారు. నాటి తొలి అర్చకులు పర్చూరి వెంకట రమణాచార్యుల వారసత్వాన్ని ఐదో తరానికి చెందిన రామకృష్ణమాచార్యులు కొనసాగిస్తుండగా, ఆరో తరానికి చెందిన అర్వపల్లి మనోహర్‌, నాగజ్యోతి దంపతులు ధర్మకర్తలుగా ఆలయ నిర్వహణలో పాలుపంచుకుంటున్నారు. సుమారు 150 ఎకరాల మాన్యం భూములు కలిగి ఉన్న ఈ ఆలయం, ఇప్పుడు కళ్యాణోత్సవాలకు ముస్తాబై భక్తులను ఆహ్వానిస్తోంది. ఆ దివ్య వైభవాన్ని కళ్లారా చూసి తరించడం భక్తుల పూర్వజన్మ సుకృతంగా భావిస్తారట.

న్యూస్‌రీల్‌

ఎనిమిది సెల్‌ఫోన్‌లు స్వాధీనం రూ.3.61లక్షలు ఫ్రీజ్‌

నేలతల్లి దాచిన నిధి.. సొలస రంగనాథుడి దివ్య సన్నిధి కొండవీడు కోట నీడలో కోవెల 24న స్వామివారి నిజరూప దర్శనం 27వ తేదీ నుంచి మే 5 వరకు కల్యాణోత్సవాలు

మంగళవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.8000, గరిష్ట ధర రూ.13,700, మోడల్‌ ధర రూ.10,500 వరకు పలికింది.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువనుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.2280 టీఎంసీలు.

క్రికెట్‌ బెట్టింగ్‌

ముఠా అరెస్ట్‌

తెనాలి రూరల్‌: క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.10 వేల నగదు, ఎనిమిది సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకోవడంతోపాటు నిందితుల ఖాతాల్లోని రూ.3.61 లక్షలను ఫ్రీజ్‌ చేయించారు. తెనాలి రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ బి.జనార్ధనరావు వివరాలు వెల్లడించారు. కొల్లిపర మండలం అత్తోట గ్రామంలోని పాఠశాల సమీపంలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారని ఎస్‌ఐ ఎన్‌సీ ప్రసాద్‌కు ఆదివారం వచ్చిన సమాచారంతో తన సిబ్బందితో కలసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇద్దరు ప్రధాన నిర్వాహకులతోపాటు బెట్టింగ్‌లో పాల్గొన్న మరో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన ప్రధానసూత్రధారి ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా బెట్టింగ్‌ లింక్‌ను అత్తోటలోని వ్యక్తులకు పంపి ఐడీ, పాస్‌వర్డ్‌ను చెప్పేవాడు. దాని ఆధారంగా లాగిన్‌ అయి బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి మినహా మిగిలిన నిందితులను అత్తోట గ్రామానికి చెందిన బొల్లిముంత అవినాష్‌, యర్రు ప్రవీణ్‌, దాసరి రమేష్‌, బొల్లిముంత రమేష్‌, బొల్లిముంత శంతన్‌, బొల్లిముంత ఉమామహేశ్వరరావులుగా గుర్తించా రు. వీరి వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకోవడంతో పాటు వీరి ఖాతా ల్లోని నగదును ఫ్రీజ్‌ చేయించినట్టు డీఎస్పీ తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న రూరల్‌ సీఐ నాయబ్‌ రసూల్‌, కొల్లిపర ఎస్‌ఐ ఎన్‌సీ ప్రసాద్‌, ఏఎస్‌ఐలు ప్రసాదరావు, పోతురాజు, హెడ్‌కానిస్టేబుళ్లు సత్యనారాయణ, మురళీకృష్ణ, కానిస్టేబుల్‌ కూర్మారావులను డీఎస్పీ అభినందించారు.

మట్టిలో మౌనం.. శతాబ్దాల ధ్యానం..

నాగలి స్పర్శతో భక్తులకు దర్శనం

అలంకారం వీడి..ఆత్మరూపం చూపి

తరాల సేవ..తరగని భక్తి...

ఆసుపత్రిపై అర్ధరాత్రి దాడి

7

Advertisement
 
Advertisement
Advertisement