చేయి తడిపితే ఓకే ! | - | Sakshi
Sakshi News home page

చేయి తడిపితే ఓకే !

Aug 1 2025 11:40 AM | Updated on Aug 1 2025 11:40 AM

చేయి

చేయి తడిపితే ఓకే !

గుంటూరు
శుక్రవారం శ్రీ 1 శ్రీ ఆగస్టు శ్రీ 2025
ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు నేటితో తెర !

దేశమాంబకి ప్రత్యేక పూజలు

మంచాల (చేబ్రోలు): మండలంలోని మంచాల గ్రామ దేవత దేశమాంబకి శ్రావణ మాసం సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

అలరించిన భక్తి సంకీర్తన

నగరంపాలెం: స్థానిక నల్లచెరువులోని శ్రీకోదండరామ మందిరంలో గురువారం నిర్వహించిన స్వరరాగ సుధా (గుంటూరు) భక్తి సంకీర్తన భక్తులను అలరించింది.

తెనాలిలో పోలీసుల తనిఖీలు

తెనాలి రూరల్‌: తెనాలిలో గురువారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ సతీష్‌ కుమార్‌ స్వయంగా సోదాలను పర్యవేక్షించారు.

సాక్షి ప్రతినిధి, గుంటూరు : గుంటూరు సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌లో బదిలీలు వివాదాస్పదంగా మారాయి. అడిగినంత మామూళ్లు ఇవ్వడానికి అంగీకరించని సిబ్బందిని బదిలీపై వచ్చిన నెలరోజుల్లోనే తాత్కాలిక సర్దుబాటు పేరుతో సీట్లు మార్చడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారులు పర్మినెంట్‌ సిబ్బందిని బదిలీ చేసి, ఆ స్థానంలో తమకు అనుకూలంగా వ్యవహరించే కాంట్రాక్ట్‌ సిబ్బందిని నియమించారు. కొత్తగా సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ జిల్లా మేనేజర్‌గా వచ్చిన ఓ అధికారి నెలవారీ మామూళ్లు పెంచాలని డిమాండ్‌ చేయడం వివాదాస్పదంగా మారింది. దీనికి అంగీకరించని వారిని నెల రోజుల్లోనే బదిలీ చేయడం ఆ విభాగంలో ఇప్పుడు చర్చకు దారితీసింది.

బది‘లీలల’కు మచ్చు తునకలు

గ్రేడ్‌–2 ఉద్యోగిగా పనిచేస్తున్న వై. అనీల్‌కుమార్‌రెడ్డిని గుంటూరు రూరల్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌, పెట్రోల్‌ బంక్‌ల పర్యవేక్షణ నుంచి తప్పించి, జిల్లా కార్యాలయంలో బాధ్యతలు అప్పగించారు. ఆయన్ను ఈ పోస్టులోకి బదిలీ చేసి నెలరోజులు మాత్రమే అయ్యింది. తమకు అనుకూలంగా లేడన్న కారణంతో జాయింట్‌ కలెక్టర్‌ కార్యాలయంలోని ఉద్యోగులతో కలిసి ఈ బదిలీ చేయించినట్లు సమాచారం. ఆయన స్థానంలో గ్రేడ్‌–3 కాంట్రాక్టు ఉద్యోగులైన జబీబుల్లా గుంటూరు రూరల్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌, కె. లీలకు తన విధులతోపాటు పెట్రోల్‌ బంక్‌ల పర్యవేక్షణ తాత్కాలిక సర్దుబాటు కింద అప్పగించారు. బాపట్ల నుంచి డెప్యూటేషన్‌పై వచ్చిన మరో కాంట్రాక్టు ఉద్యోగికి పొన్నూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇంచార్జిగా తాత్కాలిక సర్దుబాటు కింద ఆదేశాలు ఇచ్చారు. వీరితోపాటు మరో నలుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా బదిలీ చేశారు. కీలకమైన ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు తమకు అనుకూలమైన సిబ్బంది దొరక్క ఇప్పటి వరకూ సిబ్బందిని నియమించలేదు. ప్రత్తిపాడు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌, పెట్రోల్‌ అవుట్‌లెట్స్‌ ఇంచార్జి నెలన్నర కిందట సస్పెండ్‌ అయ్యారు. ఆ పోస్టు ఇప్పటికీ ఖాళీగానే ఉంది. ఆ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ బాధ్యతలను ఇంకా ఏ ఉద్యోగికి అధికారికంగా అప్పగించలేదు. సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌లో జరుగుతున్న ఈ వ్యవహారంపై ఉద్యోగులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

కళాశాలలను మార్చుకునేందుకు

నేడు చివరి అవకాశం

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు శుక్రవారంతో తెర పడనుంది. మేలో జరిగిన ఏపీ ఈఏపీసెట్‌–2025లో అర్హత సాధించి, వెబ్‌ ఆన్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఎస్సీహెచ్‌ఈ) ఇటీవల మొదటి విడతలో బీటెక్‌ సీట్లను కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో మొదటి దశలోనే 90 శాతం మేరకు సీట్లు భర్తీ అయ్యాయి. చివరి దశ కౌన్సెలింగ్‌కు గడువు శుక్రవారం ముగియనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంతో పాటు నరసరావుపేటలోని జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలతో పాటు ప్రైవేటు డీమ్డ్‌ యూనివర్సిటీలను కలుపుకుని 36 ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు సహా కన్వీనర్‌ కోటాలో అందుబాటులో ఉన్న 30,240 సీట్లలో 90 శాతానికి పైగా భర్తీ అయ్యాయి.

కంప్యూటర్‌ కోర్సులకు ప్రాధాన్యత

మొదటి విడతలో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల్లో ఉన్న సీట్లన్నీ దాదాపుగా భర్తీ అయ్యాయి. సీఎస్‌ఈతో పాటు అనుబంధంగా ఉన్నబ్రాంచ్‌లకు విద్యార్థులు తొలి ప్రాధాన్యత ఇచ్చారు.

చివరి విడత కౌన్సెలింగ్‌కు అవకాశం

ఇప్పటికే వివిధ కళాశాలల్లో సీట్లు పొంది, ఇతర కళాశాలల్లో సీటు కోరుకునేందుకు ఎదురు చూస్తున్న విద్యార్థులు చివరి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా శుక్రవారం రాత్రిలోపు కొత్తగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.

వీరికి ఈనెల 4న సీట్ల కేటాయింపు జరగనుంది. సీటు పొందిన కళాశాలల్లో అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ ఇచ్చి, అక్కడ చేరకుండా చివరి దశ కౌన్సెలింగ్‌కు వెళ్తున్నామని ముందస్తుగా సమాచారం ఇచ్చిన విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అర్హులు. చివరి విడత కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు ఈనెల 8వ తేదీలోపు సంబంధిత కళాశాలల్లో చేరాల్సి ఉంది.

7

న్యూస్‌రీల్‌

పౌర సరఫరాల శాఖలో లంచావతారాలు

అడిగినంత ఇస్తే కోరిన చోటుకు బదిలీ

లేనిపక్షంలో ప్రాధాన్యత లేని పోస్టులోకి..

సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌లో

అవినీతి బాగోతం

చేయి తడిపితే ఓకే ! 1
1/5

చేయి తడిపితే ఓకే !

చేయి తడిపితే ఓకే ! 2
2/5

చేయి తడిపితే ఓకే !

చేయి తడిపితే ఓకే ! 3
3/5

చేయి తడిపితే ఓకే !

చేయి తడిపితే ఓకే ! 4
4/5

చేయి తడిపితే ఓకే !

చేయి తడిపితే ఓకే ! 5
5/5

చేయి తడిపితే ఓకే !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement