
డాక్టర్ స్వామినాథన్ జయంతిని జయప్రదం చేయండి
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్) : ఈనెల 12న జాతీయ రైతు వ్యవసాయ కమిషన్ మాజీ చైర్మన్ హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ జయంతిని జయప్రదం చేయాల్సిందిగా వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ పిలుపునిచ్చారు. గుంటూరు బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలకు గల కారణాలను తెలుసుకోవడం కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2008లో డాక్టర్ స్వామినాథన్ కమిటీ వేయడం జరిగిందని గుర్తు చేశారు. రైతు పెట్టిన పెట్టుబడికి అదనంగా 50శాతం రాబడి వస్తేనే పంట పండించగలరని, కుటుంబం జీవన కొనసాగించగలరని ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగిందన్నారు. ఈ పరిస్థితుల్లో డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఎప్పటికై నా అమలు అయ్యే విధంగా ఆయన జయంతిని ఉత్సవాలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కౌలురైతు, వ్యవసాయ కార్మిక అధ్యక్షులు బైరా పట్నం రామకృష్ణ, శెట్టి బాలరాజు, మొలక శివసాంబిరెడ్డి, బి.కోటేశ్వరి, చింతల భాస్కరరావు, ఇమ్మడి రామారావు, నాగేశ్వరరావు జంపని రామారావు, భద్రయ్య, జోషి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్