రాజధాని ప్రాంతంలోనే ఎక్కువ | - | Sakshi
Sakshi News home page

రాజధాని ప్రాంతంలోనే ఎక్కువ

Jun 27 2025 4:22 AM | Updated on Jun 27 2025 4:22 AM

రాజధాని ప్రాంతంలోనే ఎక్కువ

రాజధాని ప్రాంతంలోనే ఎక్కువ

మంగళగిరి ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధిలో గంజాయి విక్ర యాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్క ఈ స్టేషన్‌ పరిధిలోనే గత సంవత్సరం ఆగస్టులో 231.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడంతోపాటు ఏడుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. జిల్లా వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన

తరువాత 234.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 38 మందిని అరెస్ట్‌ చేశారు. దీంతోపాటు మెత్‌, ఎండీఎంఏ 23 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మూడు కేసులు నమోదు చేయడంతోపాటు 17 మందిని అరెస్ట్‌ చేశారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో సుమారు వంద కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 20 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో వైపు అధిక ధర పెట్టి మద్యం కొనుగోలు చేయలేక చాలా మంది పేదలు, రోజువారీ కూలీలు తక్కువ ధరకు లభించే శానిటైజర్‌ను మెడికల్‌ షాపుల్లో కొనుగోలు చేసి మత్తులో తేలుతున్నారు. ఆయా షాపుల్లో ఇలాంటివి విక్రయించడంపై నిబంధనలు కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement