మోదీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ | - | Sakshi
Sakshi News home page

మోదీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ

Jun 27 2025 4:22 AM | Updated on Jun 27 2025 4:22 AM

మోదీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ

మోదీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ

మార్టూరు: దేశంలో ఐదు దశాబ్దాల క్రిందటి ఎమర్జెన్సీలో ప్రజలు, ఉద్యోగులు విద్యార్థులు, మేధావులు తదితర అన్ని రంగాలకు చెందిన వారు సంక్షోభాన్ని ఎదుర్కొంటే నేడు మోదీ పాలనలో అంతకంటే ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నామని జిల్లా కౌలు రైతు సంఘం కార్యదర్శి సీహెచ్‌ గంగయ్య అన్నారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల కార్యాలయంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో గంగయ్య మాట్లాడారు. 1975 జూన్‌ 25వ తేదీన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి మేధావులు, ఉద్యోగులు, ప్రజల హక్కులు కాలరాశారన్నారు. కానీ ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో అప్రకటిత ఎమర్జెన్సీ విధించి.. అన్ని రంగాలను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం, సీబీఐ, ఈడీ, తదితర రాజ్యాంగ వ్యవస్థలను నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా తన గుప్పెట్లో పెట్టుకున్నారని తెలిపారు. దీనివలన రైతులు, కార్మికులు, ప్రజల హక్కులకు భంగం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉండగా సంస్కరణల బాట పట్టించాల్సింది పోయి వ్యవసాయాన్ని కార్పొరేట్‌ సంస్థలకు పాదాక్రాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మతం ప్రాతిపదికగా కేంద్ర ప్రభుత్వం ఆలంబిస్తున్న విధానాలను పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు ఏకతాటిపై నిలిచి ఎదురుకోవాలని లేకుంటే గత ఎమర్జెన్సీ పాలన మించిన గడ్డు పరిస్థితులను ప్రజలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు బత్తుల హనుమంతరావు, విశ్రాంత ఉద్యోగులు ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement