
తెనాలి కళాకారులు ఐదుగురికి ‘కందుకూరి’ పురస్కారాలు
తెనాలి: ప్రఖ్యాత నాటక రచయిత, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం జయంతి రోజున ఆయన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం బహూకరించనున్న ప్రతిష్టాత్మక కందుకూరి వీరేశలింగం అవార్డును రాష్ట్రంలోని ముగ్గురు కళారంగ ప్రముఖులు ఎంపికయ్యారు. వీరిలో తెనాలికి చెందిన ప్రముఖ రంగస్థల నటుడు ఆరాధ్యుల వెంకటేశ్వరరావు ఒకరు. కందుకూరి వీరేశలింగం జిల్లా అవార్డుకు గుంటూరు జిల్లా నుంచి 12 మంది ఎంపికకాగా, వీరిలో ఐదుగురు తెనాలికి చెందిన నటీనటులున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మంగళవారం సాయంత్రం ఈ అవార్డులను ప్రకటించింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం సాయంత్రం ఆరుగంటలకు ఏర్పాటయే వేడుకలో జిల్లాస్థాయి అవార్డులకు ఎంపికై న కళాకారులకు రూ.10 వేల చొప్పున నగదు, ప్రశంసాపత్రాన్ని అందజేసి, సత్కరిస్తారు. ఎంపికై న వారిలో పట్టణానికి చెందిన ప్రముఖ పౌరాణిక పద్యనాటక నటీమణి, పురుషపాత్రల్లో నటించిన ప్రతిభాశాలి గుమ్మడి విమలకుమారి ఉన్నారు. ప్రముఖ పౌరాణిక నటుడు, శ్రీదుర్గాభవానీ నాట్యమండలి వ్యవస్థాపకుడు ఆరాధ్యుల ఆదినారాయణ కూడా జిల్లా అవార్డుకు ఎంపికయ్యారు. కొలకలూరుకు చెందిన శ్రీసాయి ఆర్ట్స్ సమాజంతో నాటకరంగ ప్రయాణం చేస్తూ, ప్రస్తుత అటు నాటకాల్లో, ఇటు సినిమాలు ముమ్మరంగా నటిస్తున్న సురభి ప్రభావతి, శ్రీసాయి ఆర్ట్స్ సమాజం దర్శకుడు, నటుడు, సినీనటుడు గోపరాజు విజయ్, పట్టణానికి చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుగ్రహీత, పద్యకవి, నటుడు డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు కందుకూరి అవార్డులను స్వీకరించనున్నారు.

తెనాలి కళాకారులు ఐదుగురికి ‘కందుకూరి’ పురస్కారాలు

తెనాలి కళాకారులు ఐదుగురికి ‘కందుకూరి’ పురస్కారాలు

తెనాలి కళాకారులు ఐదుగురికి ‘కందుకూరి’ పురస్కారాలు

తెనాలి కళాకారులు ఐదుగురికి ‘కందుకూరి’ పురస్కారాలు