నంబూరులో లారీ ఢీకొని మహిళ మృతి
పెదకాకాని: రోడ్డు పక్కన నిలబడి ఉన్న మహిళను లారీ ఢీకొనడంతో మృతి చెందిన ఘటన నంబూరులో జరిగింది. పెదకాకాని మండలంలోని నంబూరు గ్రామానికి చెందిన వుయ్యూరు వెంకటరత్నం బుధవారం రాత్రి గ్రామంలోని గోళ్లమూడి రోడ్డులో ఉన్న బంధువుల ఇంటికి వెళ్ళి తిరిగి బయలు దేరింది. శివాలయం సెంటర్‌కు వచ్చే సరికి గోళ్ళమూడి నుంచి ఈమని వెళుతున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గుంటూరు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వెంకటరత్నం(52) పరిస్థితి విషమించి మరణించింది. మృతురాలికి కుమార్తె లావణ్య, కుమారుడు తారక్ ఉన్నారు. కుమారుడు అమెరికాలో ఉండటంతో మృతదేహాన్ని పెదకాకానిలోని అపరకర్మల సత్రంలోని ఏసీ బాక్స్‌లో ఉంచారు.
నంబూరులో లారీ ఢీకొని మహిళ మృతి


